
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తన పుట్టిన రోజును నిరాడంబరంగా అనాథాశ్రమంలో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గాజులరామారం ‘కేర్ అండ్ లవ్’ అనాథ శరణాలయానికి వెళ్లిన మనోజ్ అక్కడి చిన్నారులతో కలిసి తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. పిల్లలతో సరదాగా మాట్లాడి వారి బాగోగుల గురించి తెలుసుకున్నారు. అనంతరం వారికి నోట్ పుస్తకాలు, బొమ్మలు, బ్యాగ్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. తన బర్త్‌డేను చిన్నారుల మధ్య సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని మంచు మనోజ్ తెలిపారు. ‘పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. భవిష్యత్తులో పిల్లలకు మరిన్ని సేవలు అందిస్తా. వారి కళ్లలో ఆనందం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు మంచు మనోజ్. కాగా అనాథ పిల్లలతో కలిసి పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకున్న మంచు మనోజ్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు. అతని గొప్ప మనసుకు నిదర్శనమంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక మంచు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అతను నటిస్తోన్న తాజా చిత్రం వాట్ ది ఫిష్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. డ్రగ్స్, గేమింగ్ వంటి వాటిని గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఇక మనోజ్ గుడ్ అండ్ బ్యాడ్ లుక్స్‌లో రెండు స్వభావాలున్న పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాతో వరుణ్ కోరుకుండ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. దీంతో పాటు మంచు మనోజ్ ఎల్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాడు. భాస్కర్ బంటుపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..