Manchi Rojulochaie: కథల విషయంలో ఆచితూచి అడుగులేస్తూ హిట్స్ అందుకున్నాడు కుర్ర హీరో సంతోష్ శోభన్. నిన్న మొన్నటి వరకు హీరోగా గుర్తింపు దక్కించుకోవాలని తెగ ట్రై చేసిన సంతోష్ “ఏక్ మినీ కథ” సినిమా హిట్టుతో కాస్త కుదుట పడ్డారు. ఇక ఏకంగా ఇప్పుడో క్రేజీ డైరెక్టర్ కళ్లలో పడి.. తాను కూడా క్రేజీ హీరోగా మారిపోనున్నారు. సంతోష్ శోభన్, మెహరీన్ హీరో హీరోయిన్‌లుగా స్టార్ డైరెక్టర్ మారుతి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మంచి రోజులొచ్చాయ్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను రూపొందిస్తుంది. దీపావళి సందర్భంగా నవంబర్ 4న మంచి రోజులు వచ్చాయి సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మ్యాచో హీరో గోపీచంద్ హాజరయ్యారు.
ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు. టాక్సీవాలా తర్వాత ఆయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, వి సెల్యులాయిడ్ SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :