Toxic Movie: ఏ పాట చూసిన మొత్తం రొమాన్సే.. టాక్సిక్ నుంచి మరో సాంగ్ రిలీజ్.. దెబ్బకు యూట్యూబ్ షేక్..

ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో టాక్సిక్ ఒకటి. కేజీఎఫ్ చిత్రాల తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ఈ సినిమా పై మంచి హైప్ నెలకొంది. అయితే ఈ మూవీ మొదటి నుంచి వార్తలలో నిలుస్తుంది. ఇందుకు కారణం.. ఈ సినిమాలోని సాంగ్స్, సన్నివేశాలే.. తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం విడుదలైన ఈ సాంగ్ యూట్యూబ్ షేక్ చేస్తుంది.

Toxic Movie: ఏ పాట చూసిన మొత్తం రొమాన్సే.. టాక్సిక్ నుంచి మరో సాంగ్ రిలీజ్.. దెబ్బకు యూట్యూబ్ షేక్..
Toxic

Updated on: Jul 21, 2026 | 2:31 PM

కేజీఎఫ్’ (KGF) సిరీస్ సునామీ విజయం తర్వాత రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘టాక్సిక్’. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా చిత్రానికి నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ హైప్ పెంచుతున్నారు. ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్, అలాగే మొదట విడుదలైన ‘తబాహి’ పాటలో యష్ – కియారా అద్వానీల మధ్య సాగిన రొమాన్స్ సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా నుండి ‘మనసాగదే’ అనే రెండో రొమాంటిక్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో యష్, బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా మధ్య సాగిన కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా, బాత్ టబ్‌లో గన్‌తో లవ్ ప్రపోజ్ చేసే సన్నివేశం చాలా వెరైటీగా, డిఫరెంట్‌గా అనిపిస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. మాస్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ లుక్‌కు భిన్నంగా యష్ ఇలా కేర్‌ఫ్రీ రొమాంటిక్ అవతార్‌లో కనిపించడం ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ అని చెప్పవచ్చు.

తనిష్క్ బాగ్చి, అర్సలాన్ నిజామీ, ఫహీమ్ అబ్దుల్లా స్వరపరిచిన ఈ మెలోడీకి ప్రముఖ గాయకుడు సిద్ధార్థ్ బస్రూర్ గొంతు కలపగా, రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం వినసొంపుగా ఉంది. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి వంటి టాప్ నటీమణులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్‌లో యాక్షన్ కంటే గ్లామరస్ రొమాన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తుండగా, త్వరలో రాబోయే ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో చాలా గొప్ప మనిషి.. ఆయన పేరు వినగానే రజినీకాంత్ సిగరెట్ పడేసి నిలబడ్డారు.. తనికెళ్ల భరణి..

టాక్సిక్ సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Sudhakar : నేను కోమాలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన హీరో అతడే.. నటుడు సుధాకర్..

Follow Us