తమిళ్లో ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు లోకేష్ కనగరాజ్. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే విక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న లోకేష్. రీసెంట్ గా లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేయనున్నాడు. ఇటీవలే ఈ సినిమాను అనౌన్స్ చేశారు కూడా.. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కలిసి ‘తలైవర్ 171’ చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి నెలలో ఈ సినిమా సెట్స్ పైకి రానుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.
దీంతో పాటు ఈ సినిమాపై పలు రూమర్స్ కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి కూడా నటిస్తారని ప్రచారం జరుగుతుంది. చాలా రోజులుగా ఈ వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా దీని పై మమ్ముట్టి స్పందించారు.
జైలర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు రజనీకాంత్. ‘లియో’ సినిమాతో లోకేష్ కనగరాజ్ స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. లియో సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. దాంతో ఇప్పుడు లోకేష్ భారీ సక్సెస్ సాధించాలని కసి మీద ఉన్నాడు. ఈక్రమంలో’తలైవర్ 171′ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న సూపర్ స్టార్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మమ్ముట్టి నటిస్తారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా ‘కాదల్ ది కోర్’ సినిమా ప్రమోషన్‌లో మమ్ముట్టి, జ్యోతిక పాల్గొన్నారు. ఈ ప్రమోషన్స్ లో రజనీకాంత్ 171వ సినిమా గురించి మమ్మూటీకి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. ఈ వార్తల్లో నిజం లేదని అన్నారు. ‘లోకేశ్ కనగరాజ్ సినిమా సినిమాలో మీరు భాగమవుతారా.? అని ప్రశ్నించగా.. నాకు మలయాళ సినిమా చాలు. ఈ విషయం నాకు తెలియదు. లోకేష్ పిలవనివ్వండి, అప్పుడు చూద్దాం’ అని మమ్ముట్టి అన్నారు. దీంతో అన్ని రూమర్లకు తెర పడింది. మరోవైపు రజనీకాంత్ సినిమా టైటిల్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
https://t.co/8Fhuv4qZt8#LalSalaam @ash_rajinikanth @arrahman pic.twitter.com/I0sn73oniI
— Rajinikanth (@rajinikanth) November 12, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.