Actor Jayaram: మాలీవుడ్ ని వెంటాడుతున్న కరోనా.. అల వైకుంఠపురం ఫేమ్ జయరామ్ కి పాజిటివ్..

Actor Jayaram: దేశంలో కరోనా వైరస్(Corona Virus) కేసులు మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ (Third Wave) మొదలయ్యాక సామాన్యులు, సిని నటీనటులు, రాజకీయ నేతలు అనే తేడా లేకుండా..

Actor Jayaram: మాలీవుడ్ ని వెంటాడుతున్న కరోనా.. అల వైకుంఠపురం ఫేమ్ జయరామ్ కి పాజిటివ్..
Jayaram Tested Positive

Updated on: Jan 24, 2022 | 8:44 AM

Actor Jayaram: దేశంలో కరోనా వైరస్(Corona Virus) కేసులు మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ (Third Wave) మొదలయ్యాక సామాన్యులు, సిని నటీనటులు, రాజకీయ నేతలు అనే తేడా లేకుండా అందరూ బాధితులుగా మారిపోతున్నారు. ముఖ్యంగా సిని పరిశ్రమకు చెందిన వారు ఎక్కువుగా కోవిడ్ బారిన పడుతున్నారు. మాలీవుడ్ ని కరోనా ఫీవర్ వెంటాడుతోంది. గత రెండు, మూడు రోజుల నుంచి ముమ్ముట్టి, సురేష్ గోపీ, దుల్ఖర్ సల్మాన్ వంటివారు ఈ వైరస్ బారిన పాడగా తాజాగా మరో మాలీవుడ్ నటుడు ఈ మహమ్మారి బారినపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..

ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తనకు కరోనా సోకిందని.. ఈ వైరస్ మనతోనే ఇంకా ఉందని గుర్తు చేశారు. అంతేకాదు తనతో పాటు కాంటాక్ట్ ఉన్న వారు అందరూ వెంటనే ఐసోలేషన్ లోకి వెళ్లాల్సిందిగా సూచించారు. ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు జయరామ్. తాను ఇప్పటికే చికిత్స తీసుకోవడం మొదలు పెట్టినట్లు.. మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే అందరినీ కలుస్తానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
ఈ మలయాళ నటుడు అనుష్క నటించిన భాగమతి, అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠంపురం సినిమాలలో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. ప్రస్తుతం జయరామ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. మలయాళ సినిమాలతో పాటు.. ఓ తమిళ సినిమాలో కూడా సెట్స్ మీద ఉన్నాయి.

 

Also Read:   ట్రాక్ తప్పిన కార్తీక దీపం.. బీట్ చేసిన గృహలక్ష్మి.. వంటలక్కకు తగ్గిన ఆదరణ.. రీప్లేస్ చేసిన దేవత..