Akhil Akkineni: అఖిల్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ వచ్చేసింది.. రిలీజ్ డేట్‌లో నో చేంజ్

|

Apr 07, 2023 | 11:53 AM

అఖిల్ ఎంట్రీనే యాక్షన్ డైరెక్టర్ వి వి వినాయక్ తో చేశాడు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అఖిల్ సినిమా తెరకెక్కింది. కానీ ఈ సినిమా మొన్నామధ్య మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అఖిల్.

Akhil Akkineni: అఖిల్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ వచ్చేసింది.. రిలీజ్ డేట్‌లో నో చేంజ్
Akhil Akkineni
Follow us on

అక్కినేని యంగ్ హీరో అఖిల్ సాలిడ్ హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తోన్నప్పటికీ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అఖిల్ ఎంట్రీనే యాక్షన్ డైరెక్టర్ వి వి వినాయక్ తో చేశాడు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అఖిల్ సినిమా తెరకెక్కింది. కానీ ఈ సినిమా మొన్నామధ్య మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అఖిల్. ఈ సినిమా హిట్ అయినప్పటికీ అక్కినేని ఫ్యాన్స్ కు సరిపోలేదు. అఖిల్ ను భారీ హిట్ అను ఆశిస్తున్నారు అభిమానులు. ఇక ఇప్పుడు ఏజెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు ఈ యంగ్ హీరో. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అఖిల్. ఏజెంట్ అనే టైటిల్ తో వస్తోన్న ఈ సినిమా ఓ స్పై థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా అఖిల్ బర్త్ డే ఒకరోజు ముందే ఏజెంట్ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ పలుసార్లు వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా ఏజెంట్ మూవీని రిలీజ్ డేట్ అనౌన్స్ తో పాటు అదిరిపోయే పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఏజెంట్ మూవీని ఈ నెల 28న విడుదల చేయనున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో మూవీ ఉంది. సాక్షి వైద్య ఈ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది.