
ఎలాంటి అంచనాలు లేకుండా.. చిన్న సినిమాగా అదికూడా ఇతర భాషనుంచి తెలుగులోకి డబ్ అయ్యి సంచలన విజయం సాధించిన సినిమా కాంతార. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా ముందుగా కన్నడభాషలో విడుదలై అక్కడ మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమా ఆతర్వాత తెలుగులో విడుదలైంది. కన్నడ ప్రజల దైవం నృత్యం అయినా భూత కోలా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 16 కోట్లతో తెరకెక్కి దాదాపు 400 కోట్లకుయ్ పైగా వసూల్ చేసింది రికార్డ్ క్రియేట్ చేసింది. కాంతార సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపు రానుంది. తెలుగు, హిందీ భాషల్లోనూ మంచి కలెక్షన్స్ సాధించింది కాంతార 2.
కాంతార సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు హీరో రిషబ్ శెట్టి. ఈ సినిమా కథను సిద్ధం చేస్తున్నాడు రిషబ్ శెట్టి. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కుతోన్న కాంతారం-2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుత కాంతారా సినిమా బడ్జెట్ గురించి చర్చ జరుగుతోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని చూస్తున్నారు మేకర్స్. కాంతారా 2 కోసం రూ.125 కోట్లు బడ్జెట్ ను కేటాయించాలని భావిస్తున్నారట మేకర్స్. అలాగే ఈ సినిమా కోసం కొంతమంది టాలెంటెడ్ యాక్టర్స్ ను రంగంలోకి దింపుతున్నారట. ఈసారి కాంతార సినిమాను ఒకే సారి అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ కూడా భారీగా ఉండనున్నాయట. ఇక కాంతారా సినిమాను రిషబ్ శెట్టి తన సొంత గ్రామం కుందాపూర్‌లోనే జరిగింది. అయితే ఇప్పుడు రెండో భాగాన్ని మంగళూరులో షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.