Mahesh Babu: మహేష్ బాబు, రమేష్ బాబు.. కూతుర్ల డాన్స్ చూశారా ?.. ఒకరికి మించి ఒకరు.. రెండు కళ్లు చాలవు..

తాజాగా సీతూపాప షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. ఎప్పటిలాగే కాకుండా ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటుంది. కారణం ఎప్పుడూ కెమెరా ముందు కనిపించని రమేష్ బాబు కూతురు భారతి ఉండడం.

Mahesh Babu: మహేష్ బాబు, రమేష్ బాబు.. కూతుర్ల డాన్స్ చూశారా ?.. ఒకరికి మించి ఒకరు.. రెండు కళ్లు చాలవు..
Sitara, Bharathi Ghattamane

Updated on: Jan 14, 2023 | 7:30 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే సోషల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టి ఎంతో మంది పాలోవర్లను సంపాదించుకుంది. సీతూపాప నెట్టింట ఎంతో యాక్టివ్‏గా ఉంటుంది. ఫ్యామిలీ ఫోటోస్ మాత్రమే కాకుండా.. స్నేహితులతో కలిసి చేసే అల్లరి.. వేకేషన్ టిప్స్ ఇలా అన్నింటిని షేర్ చేస్తుంటుంది. అలాగే.. తనకు నచ్చిన పాటలకు స్టెప్పులేస్తున్న వీడియోస్ కూడా పంచుకుంటుంది. తన ముద్దు ముద్దు మాటలతో.. అల్లరితో సూపర్ స్టార్‏ను మైమరపిస్తుంది. సితార మల్టీటాలెంటెడ్ . డ్యాన్సింగ్ టాలెంట్.. పెయింటింగ్.. సింగింగ్..ఇలా అన్నింట్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ఆకట్టుకుంటుంది. తాజాగా సీతూపాప షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. ఎప్పటిలాగే కాకుండా ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటుంది. కారణం ఎప్పుడూ కెమెరా ముందు కనిపించని రమేష్ బాబు కూతురు భారతి ఉండడం.

మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు గతేడాది కన్నుమూశారు. ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన వివరాలు అంతగా బయటకు రావు. ముఖ్యంగా ఆయన కూతురు, కుమారుడు సోషల్ మీడియాలో చాలా సైలెంట్. వారికి సంబంధించిన ఫోటోస్ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. సూపర్ స్టార్ కృష్ణ దశదిన కర్మ సమయంలో ఆయన కుటుంబం మీడియా ముందుకు వచ్చింది. ఆ సమయంలో తమ బాబాయ్ మహేష్ బాబుతో కలిసి రమేష్ బాబు కూతురు.. కుమారుడు దిగిన ఫోటోస్ వైరలయ్యాయి. అందులో భారతి ఘట్టమనేని ఎంతో అందంగా..క్యూట్ కనిపిస్తూ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత మహేష్ సతీమణి షేర్ చేసిన ఓ ఫోటోలో కనిపించగా.. ఇప్పుడు సీతూపాపతో కలిసి అందంగా డ్యాన్స్ చేసింది.

ఇవి కూడా చదవండి

సీతార షేర్ చేసిన ఆ వీడియో.. భారతి ఘట్టమనేని.. సితార ఘట్టమనేని ఇద్దరు కలిసి హాలీవుడ్ మ్యుజిక్‏కు స్టెప్పులేశారు. అందులో ఇద్దరూ ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా ఎంతో క్యూట్ గా చక్కగా డాన్స్ చేశారు. వీరిద్దరు కలిసి ఇలా డాన్స్ చేయడం చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఈ వీడియోకు సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us