స్టార్ హీరో మహేష్‌బాబు కూతురు సితార యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి డిజిటల్ రంగంలో అడుగుపెట్టింది. ఇప్పటివరకు తాను పాడిన పాటలు, చేసిన అల్లరి అన్నీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఇప్పుడు “ఏ అండ్ ఎస్” పేరుతో దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తెతో కలిసి ఈ ఛానల్ ఏర్పాటు చేసింది సితార. ఇందులో ఏ అంటే ఆద్య, ఎస్ అంటే సితార. ఆద్య, సితార మంచి ఫ్రెండ్స్ కావడంతో తమ పేర్లలోని మొదటి అక్షరాలతో ఏ అండ్ ఎస్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఈ ఛానల్‌లో మొదటి వీడియోగా “3 మార్కర్స్ ఛాలెంజ్” పేరుతో పోస్టు చేసిన వీడియోలో సితార, ఆద్యాలు బొమ్మలకు కలర్స్ ఫిల్ చేయడంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. సితార, ఆద్య రూపొందించిన వీడియోని తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసి మహేష్‌బాబు విష్ చేశారు.
Some fun time for these little girls!!! Enjoy ur YouTube stint ♥♥ Wishing you two all the very BEST ???#AadyaSitara ?https://t.co/Do5SQfqa4j
— Mahesh Babu (@urstrulyMahesh) July 18, 2019