Mahesh Babu: ఆ సినిమాలో స్టార్ నటుడి యాక్టింగ్ చూసి షాకైన మహేష్.. ఏకంగా కళ్లజోడ్ల షాప్ గిఫ్ట్ ఇవ్వాలన్నాడట..

సర్కార్ వారి పాట సినిమా కోసం సముద్రఖనిని ఎలా ఎంపిక చేశారన్న విషయాన్ని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరో మహేష్ బాబు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అలాగే ఆయన యాక్టింగ్ గురించి కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Mahesh Babu: ఆ సినిమాలో స్టార్ నటుడి యాక్టింగ్ చూసి షాకైన మహేష్.. ఏకంగా కళ్లజోడ్ల షాప్ గిఫ్ట్ ఇవ్వాలన్నాడట..
Mahesh Babu

Updated on: Jan 14, 2026 | 1:19 PM

సర్కార్ వారి పాట సినిమా కోసం సముద్రఖని ఎంపిక చాలా ఆసక్తికరంగా జరిగిందని ఆ మూవీ డైరెక్టర్ పరుశురామ్ అన్నాడు. మహేష్ బాబుతో ఒక ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థతో సినిమా చేస్తుంటే.. అతడికి యాంటీగా ఓ కీలక రోల్‌ కోసం నటుడిని ఎంపిక చేయాలంటే అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది స్టార్ నటుల పేర్లను పరిశీలించాం. కానీ ఎవ్వరూ కూడా నటించేందుకు సిద్దంగా లేరు. అప్పుడు సముద్రఖని పేరు తట్టడం.. ఆయన నటన, ఆ పాత్రకు కావాల్సిన స్టైల్.. సముద్రఖని తీసుకోస్తారని నమ్మి.. ఎంపిక చేశామని.. దానికి ఆయన 100 శాతం నిరూపించుకున్నారని చెప్పాడు దర్శకుడు పరుశురామ్.

ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’

సర్కార్ వారి పాట షూటింగ్ చివరి రోజున సముద్రఖని, దర్శకుడి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుందట. ‘ఈ సినిమా చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు సినిమాలో చాలా ఎక్కువగా కళ్ళజోళ్లు వాడారు. నాకు కళ్ళజోళ్లు అంటే చాలా ఇష్టం. కాబట్టి గుర్తుగా ఒక కళ్ళజోడు ఇవ్వండి, దాన్ని ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టుకుంటాను’ అని అడిగారట సముద్రఖని. మొదట దర్శకుడు దీనికి ‘ఓకే’ అన్నాడు. అయితే, సినిమా డబ్బింగ్ చూస్తున్నప్పుడు సముద్రఖని నటనను మరోసారి చూసిన తర్వాత, దర్శకుడి మనసు మారింది. ఆయన అద్భుతమైన నటనకు ఒక కళ్ళజోడు సరిపోదని, ‘ఎక్కడికైనా తీసుకెళ్లి ఒక కళ్ళజోడు కొట్టే ఇవ్వాలి’ అనిపించిందని దర్శకుడు, మహేష్ బాబు చెప్పారట.

ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..