Mahesh Babu : బాలీవుడ్ నటుడు పర్హాన్ అక్తర్‌పై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. పర్హాన్ అక్తర్ హీరోగా నటించిన తుఫాన్ మూవీ టీజర్ ఇటీవల విడుదలైంది. అయితే టీజర్ చూసిన మహేశ్ అదిరిపోయిందని పర్హాన్ క్యారెక్టర్‌ను మెచ్చుకుంటు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే నటుడు పర్హాన్ అక్తర్ క్యారెక్టర్ కోసం చాలా కష్టపడతాడని తెలుసు. ఎందుకంటే గతంలో ఆయన హీరోగా వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’తో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న తుఫాన్ మూవీలో ఆయన బాక్సర్‌గా కనిపించనున్నారు. ఆయన తన దేహ దారుఢ్యాన్ని మలుచుకున్న విధానం సినీ ప్రముఖులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
దీనిపై స్పందించిన మహేశ్.. ఫర్హాన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ‘తుపాన్ టీజర్ అద్భుతంగా ఉందని, ఈ పాత్రకోసం ఫర్హాన్ అక్తర్ సన్నద్ధమైన తీరు నమ్మశక్యం కానిదని అన్నారు. ఫర్హాన్ తానేమిటో మరోసారి నిరూపించుకున్నారని, ఈ చిత్రాన్ని త్వరగా చూసేయాలని ఉందంటూ ‘తుపాన్ ’టీజర్ లింక్‌ను పోస్ట్ చేశారు. ‘భాగ్ మిల్కా భాగ్’లో కూడా ఒక ఆథ్లెట్‌కు ఉండే ఆహార్యంతో ఆకట్టుకున్న ఫర్హాన్ ‘తుపాన్’లో కనిపిస్తున్న తీరు చూస్తుంటే ఒక పాత్ర కోసం నటులు ఎంతగా శ్రమిస్తారో స్పష్టమౌతోంది. బాలీవుడ్ స్టార్స్ షారుక్, సల్మాన్‌లు కూడా ఫర్హాన్‌ను మెచ్చుకున్న సంగతి తెలిసిందే!
తుఫాన్ టీజర్ చూస్తుంటే ప్రారంభంలో గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించిన ఫర్హాన్.. ఆ తర్వాత బాక్సర్‌గా మారినట్టు తెలుస్తోంది. ‘అజ్జు.. ఓ గ్యాంగ్‌స్టర్, అజీజ్ అలీ.. ఓ బాక్సర్.. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో చాయిస్ నీదే’ అని హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ ఫర్హాన్‌తో చెబుతున్న మాటలు చూస్తుంటే.. తను హీరోను గైడ్ చేసే పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చివరలో ‘ఈ జెమ్‌ను ఎక్కడ నుంచి తెచ్చారు? వీడు జెమ్ కాదు, తుఫాన్’ వాయిస్‌తో టీజర్ ముగియగా.. బాక్సింగ్ కోచ్ పాత్రలో పరేష్ రావల్ కనిపించాడు.
#Toofan teaser… terrific!! @FarOutAkhtar has aced it yet again… What an unbelievable transformation! Can’t wait to watch this one! https://t.co/yarPwNRrK5
— Mahesh Babu (@urstrulyMahesh) March 12, 2021