
మోస్ట్ అవైటెడ్ మూవీ మరికొన్ని గంటల్లో అడియన్స్ ముందుకు రాబోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా ‘గుంటూరు కారం’. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతి బాబు కీలకపాత్రలు పోషించగా.. హరికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇక మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ అడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే థియేటర్ల వద్ద సూపర్ స్టార్ ఫ్యాన్స్ సందడి షూరు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ వద్ద భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటికే పలు థియేటర్స్ లో త్రివిక్రమ్, మహేష్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు.
ఇక నైజం అభిమానులకు మహేష్ సినిమా అంటే హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లోనే చూడాలి అనుకుంటారు. అక్కడ జరిగే సెలబ్రేషన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఈ థియేటర్ వద్ద ఫ్యాన్స్ చేసే సెలబ్రేషన్స్ మరెక్కడా కనిపించవు. గతంలో కొన్ని సినిమాలకు ఫ్యామిలీ కలిసి వచ్చి మహేష్ చూశారు. అక్కడే అభిమానులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ థియేటర్ కు మహేష్ రాబోతున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.
How excited would you be if OUR 𝐒𝐔𝐏𝐄𝐑𝐒𝐓𝐀𝐑 visits his favourite Theatre TOMORROW? 🔥💥 🦁 #GunturKaraam 🌶️ pic.twitter.com/4sgjFftQUN
— Viswa CM (@ViswaCM1) January 11, 2024
కానీ సుదర్శన్ థియేటర్ కు రేపు మహేష్ వస్తే ఎలా ఉంటుంది అని సూపర్ స్టార్ టీంకు చెందిన పీఆర్ సందేహం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. దీంతో మహేష్ నిజంగానే రాబోతున్నాడా ? అనే సందేహాలు తలెత్తాయి. ఇదిలా ఉంటే.. గుంటూరు కారం బెనిఫిట్ షోస్ తెలంగాణలో ఎక్కడెక్కడ పడనున్నాయంటే.. హైదరాబాద్ లోని నెక్సన్ మాల్, ఏఎంబీ సినిమాస్, భ్రమరాంబ థియేర్, గోకుల్ థియేటర్, సుదర్శన్ థియేటర్, ప్రసాద్ మల్టీప్లెక్స్ ఇంకా మిగతా థియేటర్లలో గుంటూరు కారం బెనిఫిట్ షోస్ పడనున్నాయి.
Viswanath decoration >>>
🥵🔥🔥@urstrulyMahesh #GunturKaraam pic.twitter.com/MGYlOcPAbm— 🦁VENKY🌶️ (@Dhfmvk18__) January 11, 2024
Few hours to go 🔥🔥🤙🏻#Gunturkaraam pic.twitter.com/ylfhDbmPrB
— SRINU PRINCE DHFMB 🌶️🔥💯 (@Srinu_prince12) January 11, 2024
Dear Vizag Super Fans,
Sangam Sarat has commenced celebrations.Join if you are nearby! 🥁#GunturKaaramBookings#GunturKaraam
pic.twitter.com/ohTD1exwme— Siva🌶️ (@_FanOfSSMB) January 11, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.