Pokiri: రి-రిలీజ్‌ సినిమాకు కూడా కోట్లలో కలెక్షన్ల వరద.. Mahesh babu అంటే ఇది.. కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్

|

Aug 12, 2022 | 5:38 PM

ఎవ్వరి సినిమా జస్ట్ హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలువుతాయో ఆయనే మహేశ్ బాబు. ఇక సూపర్ స్టార్‌కు ఉన్న ఫ్యాన్స్ బేస్‌ గురించి స్పెసల్‌గా చెప్పాలా..?

Pokiri: రి-రిలీజ్‌ సినిమాకు కూడా కోట్లలో కలెక్షన్ల వరద.. Mahesh babu అంటే ఇది.. కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్
Mahesh Babu Pokiri
Follow us on

Superstar Mahesh: మహేశ్.. ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. అటు మాస్ ఫాలోయింగ్.. ఇటు క్లాస్ ఫాలోయింగ్ రెండింటిలోనూ మహేశ్ బాబు తోపు అంతే.  ఇక అమ్మాయిలు అయితే సూపర్ స్టార్ అంటే పడి చ్చిపోతారు. ఎవ్వరి సినిమా జస్ట్ యావరేజ్ టాక్ వస్తేనే బాక్సాఫీస్ రికార్డులు బద్దలైపోతాయో ఆయనే మహేశ్ బాబు. ఇక హిట్, సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్ అన్న పదాలు వినిపించాయా ఇక ప్రభంజనమే. కాగా ఆగస్టు 9న మహేశ్ బర్త్ డే. అంటే ఆయన అభిమానులకు పండగరోజు.  ఆ రోజున సోషల్ మీడియా(Social Media)లో ఏ లెవల్ బీభత్సం జరిగిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే మహేశ్ గత హిట్ సినిమాలను థియేటర్లలో ప్రదర్శించారు. అందులో ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ పోకిరి కూడా ఉంది. ఈ మూవీ రి-రిలీజ్ చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. కలెక్షన్ల సునామి సృష్టించింది. ఊహించినట్లుగానే, ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఫ్యాన్స్ పోకిరి స్పెసల్ షోలకు ఫ్యాన్స్ హాజరయ్యారు. ఫలితంగా ఆగస్ట్ 9న రీ-రిలీజ్ అయిన పోకిరి అన్ని చోట్లా భారీ విజయం సాధించి కలెక్షన్లను రాబట్టింది.

పోకిరి స్పెషల్ షోలు ప్రపంచ వ్యాప్తంగా 1.73 కోట్ల భారీ గ్రాస్ వసూలు చేశాయి. టాలీవుడ్‌లో రీ-రిలీజ్ అయిన ఏ సినిమాకు ఇంత కలెక్షన్ రాలేదు. భారతీయ సినిమా చరిత్రలో కూడా ఇది ఎన్నడూ లేని రికార్డు అని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. స్పెషల్ షోల స్క్రీనింగ్ సమయంలో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీలో మహేష్ బాబుకు జోడిగా ఇలియానా నటించింది. ఈ కల్ట్ మూవీకి మణిశర్మ సౌండ్‌ట్రాక్‌లు అందించారు.

పోకిరి రి రిలీజ్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి…

నైజాం 69,07,433

ఉత్తరాంధ్ర 24,89,638

గుంటూరు 13,02,265

తూర్పు గోదావరి 11,78,820

సీడెడ్ 13,36,902

కృష్ణ 10,25,251

వెస్ట్ గోదావరి 5,39,694

నెల్లూరు 4,41,752

రెస్ట్ ఆఫ్ ఇండియా- 4,01,875

ఓవర్సిస్ – 17,03,611

మొత్తం = 1,73,27,241/-

 

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.