Mahesh Babu-Chiranjeevi: బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్- సూపర్ స్టార్.. ఒకే నెలలో ఆ రెండు సినిమాలు

|

Aug 21, 2022 | 6:11 PM

సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య  హెల్దీ పోటీ ఉంటుంది. సినిమాల మీద నమ్మకంతో పెద్ద సినిమాలు ఉన్నా.. తమ సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటారు కొంతమంది స్టార్స్ .

Mahesh Babu-Chiranjeevi: బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్- సూపర్ స్టార్.. ఒకే నెలలో ఆ రెండు సినిమాలు
Mahesh Babu And Megastar
Follow us on

సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య  హెల్దీ పోటీ ఉంటుంది. సినిమాల మీద నమ్మకంతో పెద్ద సినిమాలు ఉన్నా.. తమ సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటారు కొంతమంది స్టార్స్ . ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పుడు బాక్సాఫీస్ బరిలోకి దిగనున్నారు. ఆ స్టార్ హీరోలు ఎవరో కాదు సూపర్ మహేష్ బాబు. మెగాస్టార్ చిరంజీవి. ఒకే నెలలో రెండు భారీ సినిమాలను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మహేష్, చిరు. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల తరవాత ఈ కాంబినేషన్ లో ఈ సినిమా రానుంది. మహేష్ కేరీర్ లో 28వ సినిమా వస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇక ఈ సినిమాను2023 ఏప్రిల్ 28న విడుదల చేయనున్నామని అనౌన్స్ చేశారు మేకర్స్.

ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి కూడా అదే సమయానికి రానున్నారు. మెగాస్టార్ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే. వీటిలో మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న భోళాశంకర్ సినిమా ఒకటి. తమిళ్ సినిమా వేదాళం మూవీకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ సిస్టర్ గా కీర్తిసురేష్ నటిస్తుంది. అలాగే హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్బ్ ను మొదలు పెట్టనున్నారు. అయితే మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను 2023 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అంటే మహేష్ సినిమా కంటే రెండు వారల ముందు ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇలా పెద్ద హీరోల సినిమాలు ఒకే నెలలో సందడి చేయనుండటంతో ఇరువురి ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. మరి ఈ రెండు సినిమాలో ఏ సినిమా ఏ స్థాయిలో ఆడుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి