Mahesh Babu: ఇకపై ఇక్కడ కూడా.. రేపే మహేష్ బాబు ‘ఏఎంబీ సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్.. ప్రత్యేకతలేంటో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' అనే సినిమా చేస్తున్నాడు. సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్ తో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది.

Mahesh Babu: ఇకపై ఇక్కడ కూడా.. రేపే మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్.. ప్రత్యేకతలేంటో తెలుసా?
Mahesh Babu AMB Cinemas

Updated on: Jan 15, 2026 | 3:00 PM

మహేష్ బాబు మంచి హీరోగానే కాకుండా బిజినెస్ మ్యాన్ కూడా. నిర్మాతగానే కాకుండా పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నాడు. అందులో AMB సినిమాస్ ఒకటి. ఇప్పటికే హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో ఈ మల్టీ ప్లెక్స్ ఆడియెన్స్ కు మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ను అందిస్తోంది. ఏపీలోని చాలా ప్రాంతాల్లోనూ AMB సినిమాస్ మల్టీప్లెక్స్ లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దక్షిణాదిలో మరో మెట్రో సిటీ అయిన బెంగళూరులోనూ AMB సినిమాస్ సేవలు అందించనుంది. బెంగళూరులోని చారిత్రాత్మక సినిమా హాల్ ఉన్న చోటే మహేష్ బాబు తన కొత్త సినిమా థియేటర్ ను ప్రారంభిస్తున్నారు. గతంలో బెంగళూరులోని గాంధీ నగర్‌లో చాలా సినిమా హాళ్లు ఉండేవి. వాటిలో కపాలి సినిమా థియేటర్ ఒకటి. ఇక్కడ చాలా సూపర్ హిట్ సినిమాలు ఆడాయి. ఇప్పుడు కొత్త సినిమా హాల్‌కు ‘AMB సినిమాస్ కపాలి’ అని పేరు పెట్టారు. ఇది డిసెంబర్‌లోనే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో ఒక నెల ఆలస్యం అయింది. అయితే ఎట్టకేలకు శుక్రవారం ఏఎంబీ సినిమాస్ ప్రారంభం కానుంది. మహేష్ బాబు కూడా ఈ ఓపెనింగ్ కు రానున్నాడని సమాచారం. ఇదిలా ఉంటే ఏఎంబీ సినిమాస్ ఓపెనింగ్ పై మహేష్ బాబు ట్వీట్ కూడా పెట్టాడు.

‘జనవరి 16న బెంగళూరులో AMB సినిమాస్ ప్రారంభం కానుంది. దక్షిణ భారతదేశంలో ఇది మొట్టమొదటి డాల్బీ సినిమా థియేటర్. దీనిని సాధ్యం చేయడానికి AMB బృందం చాలా కృషి చేసింది. దానికి నేను గర్వపడుతున్నాను. త్వరలో మీ అందరినీ మన బెంగళూరులో చూడాలని ఎదురు చూస్తున్నాను’ అని మహేష్ బాబు రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

కాగా బెంగళూరు ఏఎంబీ సినిమాస్ మల్టీ ప్లెక్స్ కు చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ థియేటర్ దక్షిణ భారతదేశంలో అట్మాస్ సినిమాతో కూడిన మొదటి డాల్బీ విజన్ అవుతుంది. ఇందులో 60 అడుగుల వెడల్పు గల 9 స్క్రీన్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్క్రీన్ లో సుమారు 600 మంది సినిమాను చూడొచ్చు. అత్యత్తమ వీడియో క్వాలిటీతో ఈ స్క్రీన్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అలాగే యాంబియంట్ లైటింగ్‌తో పాటు ఇక్కడ మంచి టేస్టీ ఫుడ్ ను కూడా ఆస్వాదించవచ్చు.

మహేష్ బాబు ట్వీట్..

 

 

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..