ఒకప్పుడు సినిమా అంటే ఎన్ని డేస్ ఆడిందన్న దాన్ని బట్టి హిట్టు, ఫ్లాపు అని డిసైడ్ చేశారు. కానీ ప్రజంట్ మాత్రం ఎంత కలెక్షన్లు వస్తే అంత గొప్ప. 50 డేస్, 100 డేస్ ఆడే చిత్రాలను సంవత్సరానికి వేళ్లపై లెక్కెట్టోచ్చు. తాజాగా మహర్షి మూవీ ఆ ఫీట్‌ను సొంతం చేసుకుంది. ‘మహర్షి’ చిత్రం తన కెరీర్‌లో చాలా స్పెషల్‌గా నిలిచిందని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు మహేశ్‌బాబు. ఈ సినిమా 50 రోజులు పూర్తి కావస్తోంది. దీంతో సూపర్‌హిట్ సంబరాలను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయిక. అశ్వనీ దత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మించారు.
మే 9న విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించిందని, 200 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఈ నెల 28న అర్ధశతదినోత్సవ వేడుకలను శిల్పకళావేదికలో నిర్వహించనున్నామని మూవీ యూనిట్ తెలిపింది. ఈ ఈవెంట్‌ని ముగ్గురు నిర్మాతలు గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు.