Vishal: విశాల్‌కు మద్రాస్ హైకోర్టు షాక్.. రూ. 21.29 కోట్లు కట్టాల్సిందే అంటూ ఆదేశం

తమిళ్ స్టార్ హీరో విశాల్‏కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యి విజయాన్ని అందుకున్నాయి. సహజమైన నటనతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా.. సౌత్ ఇండస్ట్రీ నటీనటుల సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Vishal: విశాల్‌కు మద్రాస్ హైకోర్టు షాక్.. రూ. 21.29 కోట్లు కట్టాల్సిందే అంటూ ఆదేశం
Vishal

Updated on: Jun 05, 2025 | 6:16 PM

కోలీవుడ్ నటుడు విశాల్‌కు మద్రాస్ హైకోర్టు షాక్  ఇచ్చింది. స్టార్ హీరో విశాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. ఇటీవలే హీరోయిన్ సాయి ధన్సికను పెళ్లాడబోతున్నట్టు అనౌన్స్ చేశాడు. ఇక విశాల్ నటించిన మదగజరాజ సినిమా దాదాపు 12ఏళ్లు వాయిదా పడి ఇటీవలే విడుదలైంది. అనేక కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా విశాల్ ఊహించని చిక్కుల్లో పడ్డాడు. విశాల్‌ను లైకా ప్రొడక్షన్స్‌కు రూ. 21.29 కోట్ల రుణాన్ని 30% వడ్డీతో చెల్లించాలని మద్రాస్ హైకోర్టు 2025 జూన్ 5న ఆదేశించింది.

విశాల్ తన నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ కోసం ఫైనాన్షియర్ అన్బుచెళియన్ నుంచి రూ. 21.29 కోట్ల రుణం తీసుకున్నాడు. ఈ రుణాన్ని లైకా ప్రొడక్షన్స్ చెల్లించింది, అయితే విశాల్ తన సినిమాల హక్కులను లైకాకు ఇవ్వాలన్న ఒప్పందాన్ని ఉల్లంఘించాడని ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేకంగా, “వీరమే వాగై సూడుమ్” ( తెలుగులో ఈ సినిమా సామాన్యుడు టైటిల్ తో రిలీజ్ అయ్యింది) ఈ సినిమా హక్కులను లైకాకు బదులు మరో సంస్థకు విక్రయించాడని లైకా ఆరోపించింది. దీని పై  2022లో లైకా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.

రెండున్నర సంవత్సరాల విచారణ తర్వాత, కోర్టు విశాల్‌ను రూ. 21.29 కోట్లను 30% వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించాడు. చివరిగా విశాల్ మదగజరాజ సినిమా తమిళ్ లో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇటీవల విశాల్ ఆరోగ్యం పై కూడా చాలా వార్తలు వచ్చాయి. ఆయన స్టేజ్ పై కళ్లు తిరిగి పడిపోవడం అభిమానుల్లో కలకలం రేపింది. అలాగే విశాల్ ధన్సిక వివాహంకు ఆగస్గు 29న ముహూర్తం

నిర్ణయించారు.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి