
నిమ్మ తోట వనములో, సీటీ చీర, బాసింగ బలాలు.. ఇలా ఎన్నో ఫోక్ సాంగ్స్ తో తెలుగు నాట మంచి గుర్తింపు సొంతం చేసుకుంది మాధురి రాథోడ్. హైదరాబాద్ కి చెందిన ఆమె మోడల్ గా, డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా అన్నిటికీ మించి జానపద నృత్యకారిణి గా మంచి పేరు తెచ్చుకుంది. ఎప్పుడూ ఫోక్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ తో వార్తల్లో నిలిచే మాధురి రాథోడ్ ఈ మధ్యన ఇతర విషయాలతో వార్తల్లో నిలిచింది. తన తోటి డ్యాన్సర్ ఈశ్వర్ సాయి తో ఒక గదిలో ఉన్నపుడు అతని భార్య శరణ్య రెడ్ హ్యాండెడ్ గా వీరిద్దరిని పట్టుకోవడం, ఆ తర్వాత ఈశ్వర్ సాయి అజ్ఞాతంలోకి వెళ్లడం, మాధురి రాథోడ్ ఈశ్వర్ పై ఛీటింగ్ కేసు పెట్టడం, చివరికి ఆమె ఆత్మహత్యాప్రయత్నం చేయడం.. ఇలా ఎన్నో సంఘటనలు తీవ్ర కలకలం రేపాయి. వీటిని చూసి మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి కెరీర్లకు ఎండ్ కార్డ్ పడినట్టే చాలా మంది భావించారు. అయితే వీరిద్దరు ఇప్పుడు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కమ్ బ్యాక్ ఇచ్చారు.
రెండు రోజుల క్రితమే ఈశ్వర్ సాయి తన కొత్త పాటకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రొఫెషనల్ లైఫ్ పరంగా తాను మళ్లీ బిజీ అవుతానని ధీమా వ్యక్తం చేశాడు. ఇక తాజాగా మాధురి రాథోడ్ మరో కొత్త ఫోక్ సాంగ్ తో మన ముందుకు వచ్చింది. ‘బిందెలు బిందెలు బావయ్యో’ అనే జానపద పాటకు సంబంధించిన గ్లింప్స్ ని తాజాగా విడుదల చేశారు. ఎప్పటిలాగే ఇందులోనూ ఫుల్ మాస్ ఎనర్జిటిక్ లెవెల్స్ తో డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది మాధురీ రాథోడ్. త్వరలోనే ఈ ఆల్బమ్ సాంగ్ విడుదల చేయబోతున్నారు.
కొన్ని గంటల క్రితమే యూట్యూబ్ లో రిలీజైన బిందెలు బిందెలు బావయ్యో సాంగ్ ప్రోమో అప్పుడే నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్ల నుంచి కూడా ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియాలోనూ ఈ సాంగ్ ఫుల్ ట్రెండ్ అవుతోంది. కాగా బిందెలు బిందెలు బావయ్యో ఫుల్ సాంగ్ బుధవారం (అక్టోబర్ 06) రిలీజ్ కానుంది. మరోవైపు ఈశ్వర్ సాయి పాట కూడా మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది.
కాగా ఈశ్వర్ సాయి- మాధురి రాథోడ్ ల జోడీకి మంచి క్రేజ్ ఉంది. వీరు కలిసి చేసిన పాటలు యూట్యూబ్ లో చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా రాతిరి రాతిరి రాతిరిలో, సిటి చీర , సన్న సన్న బియ్యమే, ప్రమీల ప్రమీల , కళ్ళకు కాటుక దిద్దినారో , అది అబ్బబ్బాగా పోరి, లాయి లాయి లబ్బరు బొమ్మ, బాసింగా బలాలే ఇలా వీరిద్దరూ కలిసి నటించిన ఫోక్ సాంగ్స్ కు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.