MAA Elections 2021: హోరాహోరీగాఎన్నికల ప్రచారం.. నటసింహంను కలిసిన మంచు విష్ణు..

మా ఎన్నికల ప్రచారాలు హోరాహోరీగా సాగుతున్నాయి.. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటం అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్- మంచు విష్ణు .. ఇద్దరు తమ ప్రచారాల వేగం పెంచారు.

MAA Elections 2021: హోరాహోరీగాఎన్నికల ప్రచారం.. నటసింహంను కలిసిన మంచు విష్ణు..
Balakrishna

Updated on: Oct 03, 2021 | 2:30 PM

MAA Elections 2021: మా ఎన్నికల ప్రచారాలు హోరాహోరీగా సాగుతున్నాయి.. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటం అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్- మంచు విష్ణు .. ఇద్దరు తమ ప్రచారాల వేగం పెంచారు. ఇప్పటికే మైకుల ముందుకు వచ్చి.. ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ హీటు పెంచుతున్నారు. మా ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ వచ్చిన వారిలో కొందరు వెనక్కి తగ్గడంతో చివరకు అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు -ప్రకాష్ రాజ్ మాత్రమే మిగిలారు. జీవితమీద పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుస్తానని చెప్పిన బండ్లగణేష్ చివరిలో ట్విస్ట్ ఇచ్చారు.. తాను నామినేషన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అలాగే మరో అభ్యర్థి సీవీఎల్ నారాయణ కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

ఇదిలా ఉంటే  ఇప్పటికే ప్రకాశ్ రాజ్.. తన తోటి కళాకారులతో కలివిడిగా మాట్లాడుతూ.. తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుండగా.. మంచు విష్ణు ఇండస్ట్రీలోని బడా హీరోలను కలుస్తూ.. తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విష్ణు తాజాగా బాలకృష్ణను కలిశారు. అయితే ఇప్పటికే మంచు విష్ణు తండ్రి మోహన్ బాబుతో కలిసి సూపర్ స్టార్ కృష్ణని కలిశారు. మా అధ్యక్షరేసులో తమ పక్షాన నిలవాలని వారు కోరారు. అందుకు కృష్ణ కూడా సానుకూలంగా స్పందించి.. విష్ణుకు మద్దతు తెలిపారు. ఇక తాజాగా విష్ణు, నందమూరి హీరో బాలకృష్ణను కలసి మా ఎన్నికల్లో సపోర్ట్ చేయమని కోరారు.ఈ విషయాన్ని విష్ణునే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెళ్లడించారు. “మా ఎన్నికల్లో నన్ను సపోర్ట్ చేస్తూ.. బ్లెస్ చేసినందుకు థ్యాంక్యూ.. బాలన్న” అంటూ విష్ణు తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అంతేకాదు బాలయ్యతో దిగిన రెండు ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

మరిన్ని ఇక్క చదవండి 

Aryan Khan: బాలీవుడ్ బాద్ షా కుమారుడు ఆర్యన్ ఖాన్ చుట్టూ వివాదాలు.. విజయాలు..

Mahesh Babu: స్పెయిన్‌ బాట పట్టిన టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ .. ఓ వైపు షూటింగ్‌ మరోవైపు ఫ్యామిలీ ట్రిప్‌..

Kodali Nani: జగన్‌ను భయపెట్టే వ్యక్తి ఇంకా పుట్టలేదు.. తన మార్క్ కామెంట్స్ చేసిన మినిస్టర్ కొడాలి నాని

Loading...
Unable to load recommendations.
Follow Us