
నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఆయా షేర్ ప్రపంచవ్యాప్తంగా టాప్ లో ట్రెండ్ అవుతూ భారీ రెస్పాన్స్ అందుకుంటుంది. ‘ది ప్యారడైజ్ చిత్రం ఆగస్టు 21న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆయా షేర్ సాంగ్ లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ విలేకరలు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
‘ఆయా షేర్’ సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ గురించి మాట్లాడుతూ.. ఆయా షేర్ పాట ప్రోమో విడుదలైనప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ చేసింది. పాట రిలీజ్ అయిన తర్వాత అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టుకుంటూ అందరికీ నచ్చింది. అనిరుధ్ గారు నేను ఇచ్చిన పదాల తీసుకొని జనాల కి రీచ్ అయ్యేవిధంగా ట్యూన్ చేశారు. మట్టి వాసన తెలిసిన జానపద గాయకులు జంగిరెడ్డి, దేవయ్య అద్భుతంగా పాడారు. ఇంత ఫిరోషియస్ సాంగ్ లో లిరిక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. నా కెరీర్లో ఈ పాట ఇచ్చినంత కిక్కు మరి ఏ పాట ఇవ్వలేదు. నేను ఉపయోగించిన భాష, యాసకి సోషల్ మీడియాలో చాలా అద్భుతమైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పాట విన్న తర్వాత నాకు చాలా మెసేజుల వచ్చాయి. జీవితంలో సర్వస్వం కోల్పోయానని బాధపడే ఓ వ్యక్తి.. ఈ పాట విని ఒక కొత్త స్ఫూర్తి పొందానని చెప్పాడు. అలాంటి మెసేజ్లు చాలా వచ్చాయి. ఈ స్పందన నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు.
ఈ సినిమాలో నాని క్యారెక్టర్ లో ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. ఆ జడల్ వెనుక మంచి కథ ఉంటుంది. ఇప్పుడు అందరూ ఆ జడలు గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా చూసిన తర్వాత వాటికి అద్భుతమైన జస్టిఫికేషన్ ఉంది అనుకుంటారు. ఇప్పుడు అందరు కూడా జడలు వేసుకుని రీల్స్ చేస్తున్నారు. ఆ కల్చర్ ని గుర్తు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అనిరుద్ గారు పాట చేస్తున్నప్పుడే పెద్ద హిట్ కొడుతున్నాం అని చెప్పారు. ఆయనతో వర్కింగ్ ప్రాసెస్ ని చాలా ఎంజాయ్ చేశాను. ఈ పాట సక్సెస్ కి ముఖ్య కారణం డైరెక్టర్ శ్రీకాంత్. జనం నుంచి పుట్టిన ఒక వీరుడు ఆ జనాలకు స్ఫూర్తిని ఇచ్చే క్రమంలో వచ్చిన పాట ఇది. ఈరోజు అందరి నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ పాట రాయడానికి వారం రోజులు పట్టింది. కొన్ని వెర్షన్స్ డెవలప్ చేసుకుంటూ చివరికి దీనిని ఫిక్స్ చేశాం. కాకపోతే సాంగ్ సెంట్రల్ ఐడియా మాత్రం ఇమ్మిడియట్ గా లాక్ చేశాం. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ చెప్పడానికి ఒక ప్రత్యేకమైన పల్లవి ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఆ ఆలోచన శ్రీకాంత్ గారికి నచ్చింది. ఈరోజు సోషల్ మీడియాలో అదే పల్లవి గురించి మాట్లాడుతున్నారు అని కాసర్ల శ్యామ్ అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.