ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడటంతో పాటు ఓటీటీల్లోనూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా తర్వాత ఓటీటీల హవా ఎక్కువైంది. సినిమాలు విడుదలైన నెల రోజల వ్యవధిలో ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ క్రమణంలోనే చాలా సూపర్ హిట్ సినిమాలు పలు ఓటీటీల్లో దర్శనమిచ్చాయి. ఇక రీసెంట్ గా థియేటర్స్ లో అదరగొట్టిన సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇక రీసెంట్ డెస్ లో చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన సినిమా లవ్ టుడే. ప్రస్తుతం యువత ఎలా ఉందో.. ప్రేమలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో ఈ సినిమా ద్వారా చూపించారు. కేవలం ఐదు కోట్ల బడ్జెత్‌తో నిర్మితమైన లవ్ టుడే సినిమా అరవై కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ సినిమాను అదే పేరుతో దిల్‌రాజు తెలుగులోకి డబ్ చేశారు.
నవంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌కు ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేమకథకు కామెడీని జోడించి ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు ప్రదీప్. ఇక ఈ సినిమా ఓటీటీలో కూడా భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పటివరకు తెలుగులో అందుబాటులో లేదు ఈ సినిమా.
తాజాగా తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లవ్ టుడే సినిమాను తెలుగులోనూ అందించింది. నిన్నటి అర్ధరాత్రి నుంచి లవ్ టు డే తెలుగు వర్షన్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.