ఈ మధ్య విభిన్న కంటెంట్ చిత్రాలను జనాలు బాగా ఆదరిస్తున్నారు. కథలో కొత్తదనం ఉంటే.. ఏ భాష సినిమా అయినా ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకే మేకర్స్ ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్లుగా సినిమాలను తీసుకొస్తున్నారు. ఆ కోవకు చెందిన చిత్రమే ‘లైన్ మ్యాన్’. వి.రఘుశాస్త్రి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో త్రిగుణ్ హీరోగా నటించాడు. పర్పుల్ రాక్ ఎంటర్‌టైనర్స్ సంస్థ ప్రొడ్యస్ చేసిన ఈ సినిమాలో కాజల్ కుందెర్ హీరోయిన్. తెలుగు, కన్నడ భాషల్లో మార్చిలో రిలీజై.. మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చింది. కన్నడ వెర్షన్ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా తెలుగులోనూ సందడి చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియోలో మీరు ఈ సినిమాని చూడొచ్చు.
సినిమా కథ విషయానికి వస్తే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో లైన్ మేన్‌గా పనిచేస్తున్న తండ్రి సడెన్‌గా మరణించడంతో ఆ ఉద్యోగం నటరాజు అలియాస్ నట్టు (త్రిగుణ్)కి వస్తుంది. ఇక ఆ గ్రామంలో కరెంట్ పోవాలన్నా, రావాలన్నా అంతా నటరాజు చేతిలోనే ఉంటుంది. ఆ ఊర్లో.. అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఆ గ్రామ దేవతగా దేవుడమ్మ(బి.జయశ్రీ) ఉంటుంది. ఆమెకు 99 సంవత్సరాలు నిండి 100వ పడిలోకి అడుగు పెడుతుండటంతో పుట్టిన రోజు వేడుకను చేయాలనుకుంటారు. అదే సమయానికి నట్టు పవర్ ఇవ్వను అని మొండికేస్తాడు. అసలు ఈ పుట్టినరోజు ఆలోచన చెప్పిన నట్టునే అలా కరెంట్ ఇవ్వను అనడంతో గ్రామస్థులు ఆశ్చర్యపోతారు. నట్టు ఎందుకు పవర్ ఇవ్వనన్నాడు? దానికి దేవుడమ్మ, గ్రామస్థుల రియాక్షన్ ఏంటి? అన్నది మూవీ కథ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి