
సినిమా ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీ రాజా (84) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బుధవారం (జూన్ 10) తెల్లవారుజామున భారతీరాజా తుదిశ్వాసవిడిచారు. లెజెండరీ డైరెక్టర్ మరణ వార్త తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 1977లో వచ్చిన తమిళ మూవీ ‘16 వయథినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు) తో దర్శకుడిగా మారారు భారతీరాజా. ఆ తర్వాత ‘కిళక్కే పోగుమ్ రైలు’, ‘సిగప్పు రోజాక్కల్’, ‘అలైగల్ ఒయివతిల్లై’, ‘కాదల్ ఓవియం’, ‘ముదల్ మరియాతై’ తదితర సూపర్ హిట్ సినిమాలను తమిళ ఆడియెన్స్ కు అందించారు. తెలుగులోనూ పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించారీ లెజెండరీ డైరెక్టర్. ‘సీతాకోక చిలుక’, ‘ఆరాధన’, ‘జమదగ్ని’, ‘ఈతరం ఇల్లాలు’, ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’, ‘కొత్త జీవితాలు’, ‘యువతరం పిలిచింది’ ఇలా ఎన్నో మంచి సినిమాలను తెలుగు ఆడియెన్స్ కు అందించారు భారతీరాజా
కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా, నిర్మాతగానూ సత్తా చాటారు భారతీ రాజా. ‘యువ’, ‘సీత కత్తి’, ‘ఈశ్వరన్’, ‘సర్’, ‘తిరు’, ‘మహారాజా’ వంటి చిత్రాల్లో ఈ దర్శకుడు కీలక పాత్రలు పోషించారు. ఇక చివరిగా ‘మీండుమ్ ఒరు మరియాదై’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు భారతీరాజా. 2020లో రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. దీని తర్వాత ఆయన మెగా ఫోన్ పట్టలేదు. కేవలం నటుడిగా మాత్రమే చేశారు. ఇక మోహన్ లాల్ నటించిన తుడురమ్ సినిమాలోనే చివరిసారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు భారతీరాజా.
కాగా గతేడాది భారతీరాజా ఏకైక కుమారుడు మనోజ్ భారతీరాజా కన్నుమూశాడు. నటుడు, దర్శకుడిగా ఎదుగుతున్న సమయంలోనే కుమారుడు ఆకస్మికంగా కన్నుమూయడం భారతీరాజాను బాగా క్రుంగదీసింది. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి ఆయనకు చాలా కాలం పట్టింది. ఈ విషాదాన్ని మర్చిపోవడానికి కొంతకాలం కుటుంబ సభ్యుల వద్ద విదేశాల్లో గడిపిన భారతీరాజా, అనంతరం చెన్నైకి తిరిగివచ్చారు.
Legendary Tamil filmmaker Bharathiraja passed away today after battling health issues. He was receiving treatment at his residence.#RIPBharathiraja #TamilCinema pic.twitter.com/0vyyFJxKfW
— Sathish Kumar (@Sathish_ernesto) June 9, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి