Prabhas Salar: స‌లార్ మూవీ నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన‌ అప్‌డేట్‌.. ప్ర‌భాస్‌కు అక్క‌గా సీనియ‌ర్ న‌టి..?

|

May 11, 2021 | 7:24 PM

Prabhas Salar: ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ అనే చిత్రం తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై యావ‌త్ దేశ వ్యాప్తంగా...

Prabhas Salar: స‌లార్ మూవీ నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన‌ అప్‌డేట్‌.. ప్ర‌భాస్‌కు అక్క‌గా సీనియ‌ర్ న‌టి..?
Prabhas Salar
Follow us on

Prabhas Salar: ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ అనే చిత్రం తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై యావ‌త్ దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ప్ర‌భాస్ రేంజ్‌కు త‌గిన‌ట్లు భారీ హంగుల‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు ప్ర‌శాంత్ నీల్‌. క‌రోనా సెకండ్ వేవ్‌కు ముందు ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రిగింది. సినిమాకు సంబంధించి తొలి షెడ్యూల్‌ను గోదావ‌రి ఖ‌నిలోని బొగ్గు గ‌నుల్లో చిత్రీక‌రించిన విష‌యం తెలిసిందే.
ఇక ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న శృతి హాస‌న్ న‌టిస్తోంది.

Ramyakrishna In Prabhas Salar

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ అయినా స‌రే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ వార్త నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఈ సినిమాలో ప్ర‌భాస్‌కు అక్క‌గా అల‌నాటి స్టార్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణగా న‌టిస్తోంద‌నేది స‌ద‌రు వార్త సారాంశం. అయితే ఈ విష‌యానికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. మ‌రి ఈ పాత్ర ర‌మ్య‌కృష్ణ‌కు ఎలాంటి ఫేమ్ తీసుకొస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ప్ర‌భాస్ హీరోగా వ‌చ్చిన బాహుబ‌లి చిత్రంలో ర‌మ్య‌కృష్ణ తల్లి పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. ఇక ర‌మ్య‌కృష్ణ ప్ర‌స్తుతం లైగ‌ర్ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు త‌ల్లిగా న‌టిస్తోంది.

Also Read: Actress Pooja Hegde: పవర్ స్టార్ ను ఫాలో అవుతున్న బుట్టబొమ్మ పూజా.. ఏం చేసిందో తెలుసా…

Shahrukh Khan : రెండు దశాబ్దాల గ్యాప్ తర్వాత ఆ దర్శకుడితో సినిమా చేస్తున్న కింగ్ ఖాన్..

Selvaraghavan: సెల్వ రాఘ‌వ‌న్, ద‌ళ‌ప‌తి విజ‌య్ కాంబోలో మూవీ..! కానీ ఇక్క‌డే క్రేజీ ట్విస్ట్