Tollywood: ఈమెను గుర్తుపట్టారా..? ఇప్పుడు తెలుగునాట సూపర్ ఫేమస్ ఆర్టిస్ట్

వెండితెరపై, బుల్లితెరపై రాణించాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో నెగ్గుకురావాలంటే టాలెంట్‌తో పాటు లక్ ఉండాలి. కొన్నిసార్లు రెండూ ఉన్నా.. లేట్ అవ్వొచ్చు. మనదైన రోజు కోసం ఓర్పుగా ఎదురుచూడాలి. పైన మీరు చూస్తున్న అమ్మాయి కూడా కోటి ఆశలతో ఇండస్ట్రీకి వచ్చి.. ఇప్పుడు అటు సినిమాల్లో.. ఇటు బుల్లితెరపై నవ్వులు పూయిస్తుంది. ఇంతకీ తనెవరో మీరు గుర్తుపట్టారా...? 

Tollywood: ఈమెను గుర్తుపట్టారా..? ఇప్పుడు తెలుగునాట సూపర్ ఫేమస్ ఆర్టిస్ట్
Actress

Updated on: Apr 05, 2025 | 5:08 PM

ఓటీటీ, సినిమాలు, బుల్లితెరపై షోలలో సందడి అంతా ఈమెదే. పెద్ద ప్రాజెక్టుల్లోనూ ఆమెకు కమెడియన్‌గా ఆఫర్లు వస్తున్నాయి. ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ల కొరత కొంతవరకు తీరుస్తుంది ఈమెనే. ఇంకో క్లూ ఏంటి అంటే..   బిగ్ బాస్ 8లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చి అందరినీ  చాలా ఎంటర్టైన్ చేసింది. హా.. ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. తను మరెవరరో కాదు రోహిణి.  సేవ్ ది టైగర్స్‌లో పనిమనిషిగా అదరగొట్టిన ఆర్టిస్ట్ రోహిణి. అవును తన చిన్నప్పటి ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. గత నెలలో రోహిణి కొత్త ఇంటి కలను నెరవేర్చుకుంది. బిగ్ బాస్‌ లోపల ఉన్న టైంలో ఫ్యామిలీ గురించి చెప్పడం, బ్రేకప్ స్టోరీ చెప్పడంతో రోహిణికి ఎమోషనల్‌గా కూడా చాలామంది కనెక్ట్ అయ్యారు.

సీరియల్స్‌తో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది ఈ ఆర్టిస్ట్. ఆపై జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి లేడీ కమెడియన్ గా బాగా పాపులర్ అయింది.  తన నటన, మాటలతో ప్రేక్షకులను నవ్వించింది. రోహిణి పలు సినిమాలలో, వెబ్ సిరీస్‌లలో నటించింది. అందులో “సేవ్ ది టైగర్స్” లో పనిమనిషి పాత్రలో నటించి బాగా అలరించింది. ఇటీవల “హనుమాన్”,  “భీమా” సినిమాల్లో కూడా కనిపించింది. ఆమె చేతిలో ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎంతో టాలెంట్ ఉన్న ఈ నటికి.. మంచి పాత్రలు పడితే ఇంకా గొప్ప స్థాయికి చేరుకుంటుంది. అందులో నో డౌట్.