
సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిన ‘కుర్చీ తాత’ అలియాస్ మహ్మద్ పాషా (66) హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ లోని కృషకాంత్ పార్కులో బుధవారం (మే20) ఉదయం వాకింగ్ చేసుండగా ఆయన ఒక్క సారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతమున్న ఎండల తీవ్రతకు, వడదెబ్బ కారణంగానే కుర్చీతాత మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు కుర్చీతాత మరణ వార్త తెలుసుకున్న సినీ అభిమానులు, నెటిజన్లు తాత మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా హైదరాబాద్‌లో కృష్ణ కాంత్ పార్క్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ భిక్షమెత్తుకుంటూ జీవనం సాగించే కుర్చీతాత ఒక ఇంటర్వ్యూలో ‘కుర్చీ మడతపెట్టి’ అనే డైలాగ్ చెప్పి ఓవర్ నైట్ లోనే ఫేమస్ అయిపోయారు. రాత్రికి రాత్రే మీమ్స్, రీల్స్ రూపంలో ‘కుర్చీ తాత’గా వైరల్ అయిపోయారు. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో ఆయన పేరు మార్మోగిపోయింది. ఆ క్రేజ్ ఎంతదాకా వెళ్లిందంటే..సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాలో కుర్చీ తాత డైలాగ్‌ను ఏకంగా ఒక మాస్ సాంగ్ కోరస్‌గా వాడేశారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ డైలాగ్‌ను రీమిక్స్ చేసి సాంగ్‌లో పెట్టడంతో కుర్చీ తాత పాపులారిటీ మరింత పెరిగిపోయింది. తాత డైలాగ్‌ను వాడుకున్నందుకు గాను థమన్ ప్రత్యేకంగా ఆయనకు పారితోషికం కూడా అందించడం విశేషం. దీని తర్వాత కూడా వివిధ విషయాలు, వివాదాలతో వార్తల్లో నిలిచాడు కుర్చీతాత. కొన్ని సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.
కాగా గతంలో కూడా ‘కుర్చీ తాత చనిపోయాడు’ అంటూ పలు సార్లు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు హల్ చల్ చేశాయి. అయితే కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. కొన్నిసార్లు అయితే స్వయంగా కుర్చీతాతే మీడియా ముందుకు వచ్చి ‘నేను బ్రతికే ఉన్నాను.. ఫేక్ వార్తలు నమ్మకండి’ అని చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు కుర్చీతాత నిజంగానే కన్నుమూశారు. వడదెబ్బ కారణంగా హఠాన్మరణం చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరోవైపు సినీ అభిమానులు, నెటిజన్లు కుర్చీతాత మృతికి నివాళి అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
REST IN PEACE – KURCHI THATHA!!
“Kurchee Thatha” aka Mohammed Pasha, known for the viral “Kurchee Madathapetti” dialogue, passed away after suffering a heart attack during a walk at Krishnakant Park. pic.twitter.com/XqbXLFVYNW
— Movies4u Official (@Movies4u_Officl) May 20, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.