Guntur Karam: మాస్ స్టెప్పులతో రఫ్పాడించిన మహేష్, శ్రీలీల.. ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ప్రోమో చూశారా ?.

మరోవైపు ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో మీనాక్షి చౌదరీ, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ సంక్రాంతికి అడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి 12న గ్రాండ్‏గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే గుంటూరు కారం ప్రమోషన్స్ స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తుంది చిత్రయూనిట్.

Guntur Karam: మాస్ స్టెప్పులతో రఫ్పాడించిన మహేష్, శ్రీలీల.. కుర్చీ మడతపెట్టి సాంగ్ ప్రోమో చూశారా ?.
Mahesh Babu, Sreeleela

Updated on: Dec 29, 2023 | 11:57 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీ కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో మహేష్ ఫుల్ మాస్ అవతారంలో కనిపించనుండడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో మీనాక్షి చౌదరీ, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ సంక్రాంతికి అడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి 12న గ్రాండ్‏గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే గుంటూరు కారం ప్రమోషన్స్ స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తుంది చిత్రయూనిట్. తాజాగా కుర్చీ మడతపెట్టి సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ప్రోమో అదిరిపోయింది. ఇందులో మహేష్, శ్రీలీల మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్‏కు థమన్ మ్యూజిక్ అందించాడు. ఇక ఫుల్ సాంగ్ న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం రేపు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం రిలీజ్ అయిన సాంగ్ ప్రోమో వైరలవుతుండగా.. ఈపాటకు థియేటర్లలో వింటే రచ్చే అంటున్నారు ఫ్యాన్స్.

అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్, మహేష్ కాంబోలో రాబోతున్న మూడవ సినిమా ఇది. దీంతో గుంటూరు కారం సినిమా పై హైప్ ఎక్కువగానే ఉంది. ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలకపాత్రలలో నటించారు. మరోవైపు గుంటూరు కారం సినిమా నుంచి రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మహేష్ ఫ్యాన్స్ పేజీలలో గుంటూరు కారం కొత్త పోస్టర్స్ విడుదలవుతున్నాయి.