Monalisa: మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..

కుంభమేళాలో పూసలు అమ్ముకొని దేశం దృష్టిని ఆకర్షించిన నీలి కళ్ల సుందరి మోనాలిసా బాలీవుడ్‌ ఆశలు గల్లంతయ్యాయి. మోనాలిసాకు సినిమాలో ఛాన్స్‌ ఇప్పిస్తానని చెప్పిన డైరెక్టర్‌ సనోజ్‌ మిశ్రాను రేప్‌ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.

Monalisa: మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
Monalisa, Sanoj Mishra

Updated on: Apr 01, 2025 | 10:43 AM

మహాకుంభమేళలో పూసలు అమ్ముకునే మోనాలిసాను హీరోయిన్‌ చేస్తానన్న డైరెక్టర్‌ జైలు పాలయ్యాడు. రేప్‌ కేసులో డైరెక్టర్‌ సనోజ్‌ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మోనాలిసాతో పాటు సనోజ్‌ మిశ్రా కూడా చాలా పాపులర్‌ అయ్యారు. ఈ కేసులో మిశ్రా ముందస్తు బెయిల్‌ కోసం కోర్ట్ ని ఆశ్రయించగా, కోర్ట్ బెయిల్‌ పిటిషన్‌ని తిరస్కరించింది. దీంతో ఢిల్లీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. సనోజ్‌ మిశ్రా 28ఏళ్ల వయసున్న ఓ అమ్మాయికి సినిమా ఆఫర్‌ ఇస్తానని లోబరుచుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. . సినిమా ఆఫర్‌ ఆశ చూపించి ముంబాయిలో ఆమెతో సహజీవనం చేసినట్టు తెలుస్తోంది. సనోజ్‌ మిశ్రా తనపై పలుమార్లు పై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. తనని వివాహం చేసుకుంటానని మోసం చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడు సార్లు గర్భస్రావం చేయించుకోవాలని బలవంతం చేశాడని, ఇప్పుడు మోసం చేస్తున్నాడని చెప్పి ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 28 ఏళ్ల మహిళ ఫిర్యాదు ఆధారంగా సెంట్రల్ ఢిల్లీలోని నబీ కరీం పోలీస్‌ స్టేషన్‌లో మిశ్రపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.

మార్చి 6న అత్యాచారం, దాడి, గర్భస్రావం కలిగించడం, బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ కింద ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. ఆ యువతి గర్భస్రావాలకు సంబంధించిన వైద్యా ఆధారాలను కూడా పోలీసులు సేకరించినట్టు సమాచారం. ఈ దెబ్బతో మోనాలిసా ఆశలు గల్లంతయ్యాయని అంటున్నారు నెటిజన్లు. సినిమా పేరుతో ఆశలు రేకెత్తెంచి ఇప్పుడు మధ్యలోనే ఆమెని వదిలేసిన పరిస్థితి నెలకొందని అంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ కేసులో ట్విస్ట్ నెలకొంది. తనపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని.. సనోజ్ అమాయకుడని సదరు యువతి తెలిపింది. అతడిని కావాలనే కొందరు ఇలా ఇరికిస్తున్నారని చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. తాను సనోజ్ తో ఉండడం.. ఇద్దరి మధ్య గొడవలు పడడం నిజమే అని.. కానీ ఎప్పుడూ ఆయన తనపై లైంగిక దాడికి పాల్పడలేదని వీడియోలో వివరించింది.

ఇది చదవండి :  Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..

Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..

Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..

Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..

Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..