
ఆ అందాల భామ.. ఆ తర్వాత వరుస పరాజయాలతో కాస్త వెనుకబడింది. అయితే తాజాగా ఆమె ఒక భారీ ఆఫర్ సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. అది కూడా టాలీవుడ్ అగ్ర హీరో, బాక్సాఫీస్ సుల్తాన్ పక్కన నటించే అవకాశం. అందరూ ఆమె హీరోయిన్ అని అనుకుంటున్నారు కానీ, అక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. మెగాస్టార్ సరసన మెరవబోతున్న ఆ బ్యూటీ ఎవరు?
ప్రస్తుతం ‘మన శంకరవరప్రసాద్’ భారీ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి, తన తర్వాతి ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. గతంలో ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు బాబీతో చిరంజీవి మరోసారి చేతులు కలుపుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభం కానుండగా, మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులోనే కృతిశెట్టి ఒక కీలక పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది.
Krithi Shettyy
కృతిశెట్టి అనగానే అందరూ చిరంజీవికి జోడీగా నటిస్తోందని భావిస్తున్నారు. కానీ ఈ సినిమాలో ఆమె చిరంజీవి కూతురి పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది. బెంగాల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ కథలో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ చాలా బలంగా ఉంటుందట.
ఒకప్పుడు ‘ఉప్పెన’తో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ బ్యూటీకి, మెగాస్టార్ సినిమాలో ఇలాంటి ఎమోషనల్ పాత్ర దక్కడం తన కెరీర్‌కు పెద్ద ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా కోసం దర్శకుడు బాబీ ఒక భారీ టీమ్‌ను సెట్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నటి ప్రియమణిని ఫైనల్ చేసినట్లు సమాచారం. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో ఆమెను ఎంపిక చేశారట.
Chiru N Krithi
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పాత్ర చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే చాలా ఏళ్ల తర్వాత చిరు సినిమాకు రెహమాన్ సంగీతం అందించడం ఒక సెన్సేషన్ అవుతుంది.
ఈ సినిమా కథా నేపథ్యం కోల్‌కతా లేదా బెంగాల్ పరిసర ప్రాంతాల్లో సాగుతుందని తెలుస్తోంది. యాక్షన్ తో పాటు కూతురు సెంటిమెంట్ హైలైట్ గా ఉండబోతోంది. మెగాస్టార్ గతంలో తండ్రి పాత్రల్లో నటించి మెప్పించిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి, ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కృతిశెట్టికి ఇది నిజంగా మెగా ఛాన్స్ అనే చెప్పాలి. హీరోయిన్ గా కాకపోయినా, మెగాస్టార్ కూతురిగా నటించడం అంటే ఆమెకు నటిగా మంచి గుర్తింపు లభిస్తుందనడంలో సందేహం లేదు.