
చేసింది తక్కువ సినిమాలే అయిన మంచి గుర్తింపు తెచ్చుకున్న భామల్లో కృతిశెట్టి ఒకరు. తెలుగులో బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. వరుసగా సినిమాలు చేసి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమాలోనే తన అందం అభినయంతో కట్టిపడేసిన కృతి శెట్టి కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. వరుసగా సినిమాలను లైనప్ చేసింది. కాకపోతే హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగా చూసింది ఈ చిన్నది. ఈ బ్యూటీ నటించిన సినిమాల్లో తొలి మూడు సినిమాలే హిట్ అయ్యాయి. ఉప్పెన, బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలు తప్ప మిగిలినవన్నీ ఫ్లాప్ అయ్యాయి. దాంతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందని ఈ ముద్దుగుమ్మ.
తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా లవ్ ఇన్సూరెన్స్ అనే సినిమాలో నటించింది. ప్రదీప్ రంగనాథ్ హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కాగా కృతికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో కృతి హాయ్ చెప్తున్నా ఓ వ్యక్తి ఆమెను పట్టించుకోకుండా వెయ్యిపోయాడు.
ఇటీవల ఓ ఈవెంట్ కు హాజరైన కృతి నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెకు ఎదురుగా వస్తున్న వ్యక్తి చూసి నవ్వుతూ కృతి శెట్టి పలకరించింది. అయినా కూడా అతను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. కావాలని అలా చేశాడో.. లేక కృతిని చూసుకోలేదో ఏమోకానీ ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. వీడెవడండీ బాబు అంత అందమైన అమ్మాయి హాయ్ చెప్తే అలా చేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.