ప్రధాని సహాయ నిధికి కృష్ణంరాజు కుమార్తెల విరాళం..పాకెట్ మ‌నీ నుంచి

ప్రపంచమంతా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ సమాజంలోని అన్ని వర్గాల వారు స్పందించాల్సిన అవసరం ఉంది ” అన్నారు సుప్రసిద్ధ నటులు, మాజీ కేంద్ర మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఆయన కుటుంబ సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిలీఫ్ ఫండ్ కు 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడారు. ” కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితులను అధిగమించటానికి డాక్టర్లు, నర్సులు , పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా ఇంకా అనేక […]

ప్రధాని సహాయ నిధికి కృష్ణంరాజు కుమార్తెల విరాళం..పాకెట్ మ‌నీ నుంచి
Follow us

|

Updated on: Apr 06, 2020 | 4:23 PM

ప్రపంచమంతా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ సమాజంలోని అన్ని వర్గాల వారు స్పందించాల్సిన అవసరం ఉంది ” అన్నారు సుప్రసిద్ధ నటులు, మాజీ కేంద్ర మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఆయన కుటుంబ సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిలీఫ్ ఫండ్ కు 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడారు.

” కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితులను అధిగమించటానికి డాక్టర్లు, నర్సులు , పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా ఇంకా అనేక శాఖల వారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారి త్యాగం, కష్టం వెలకట్టలేనివి. అందుకే ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ స్పందిస్తూ తమ శక్తి మేరకు విరాళాలు అందజేస్తున్నారు. మా కుటుంబం నుండి మా పెద్దమ్మాయి సాయి ప్రసీద, రెండవ అమ్మాయి సాయి ప్రకీర్తి, మూడవ అమ్మాయి సాయి ప్రదీప్తి తాము దాచుకున్న పాకెట్ మనీ నుండి తలా రెండు లక్షలు చొప్పున ప్రధాని రిలీఫ్ ఫండ్ కు ఇస్తామని ముందుకు వచ్చారు. అలాగే నా శ్రీమతి శ్యామలా దేవి ఏప్రిల్ 13న తన జన్మదిన సందర్భంగా నాలుగు లక్షల రూపాయలను ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కు ఇస్తానని చెప్పింది. కాబట్టి మొత్తం 10 లక్షల విరాళాన్ని ఈరోజు ప్రధానమంత్రి సహాయనిధికి పంపించడం జరిగింది. కేవలం ఆర్థిక సహకారమే కాకుండా ఈ కరోనా విపత్తును అధిగమించడానికి మన ప్రియతమ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు మార్చి 22న జనతా కర్ఫ్యూ విజయానికి సంకేతంగా చప్పట్లు కొట్టడం, ఏప్రిల్ 5న కొవ్వొత్తులు వెలిగించి మద్దతు ప్రకటించడం వంటి విషయాలలో కూడా ప్రతి ఒక్కరూ ముందుండాలని కోరుకుంటున్నాను. మా కుటుంబం మొత్తం ఈ పోరాటంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది ” అని కృష్ణంరాజు వెల్ల‌డించారు.

Latest Articles
రాణించిన ఆర్సీబీ బౌలర్లు.. గుజరాత్ ఆలౌట్.. టార్గెట్ ఎంతంటే?
రాణించిన ఆర్సీబీ బౌలర్లు.. గుజరాత్ ఆలౌట్.. టార్గెట్ ఎంతంటే?
తక్కువ ధరలో అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే
తక్కువ ధరలో అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే
పుష్ప ఫస్ట్ సాంగ్ రికార్డ్ బద్దలు.| మంచి గోస్ట్ తో వెన్నెల కిషోర్
పుష్ప ఫస్ట్ సాంగ్ రికార్డ్ బద్దలు.| మంచి గోస్ట్ తో వెన్నెల కిషోర్
ఊహకందని డిస్కౌంట్‌.. రూ. 38 వేలకే ఫోల్డబుల్ ఫోన్‌
ఊహకందని డిస్కౌంట్‌.. రూ. 38 వేలకే ఫోల్డబుల్ ఫోన్‌
తెలంగాణలో పెరిగిన డేటింగ్ యాప్ నేరాలు.. ఎక్కువ బాధితులు వీరే
తెలంగాణలో పెరిగిన డేటింగ్ యాప్ నేరాలు.. ఎక్కువ బాధితులు వీరే
బాబోయ్‌.. బిర్యానీలో పిల్లి మాంసం వాడుతున్నారా..? వీడియో చూస్తే
బాబోయ్‌.. బిర్యానీలో పిల్లి మాంసం వాడుతున్నారా..? వీడియో చూస్తే
చాలా ఈజీ.. వార్నర్‌ కు పుష్పరాజ్ టిప్స్.! | బాహుబలి ఆగమనం..
చాలా ఈజీ.. వార్నర్‌ కు పుష్పరాజ్ టిప్స్.! | బాహుబలి ఆగమనం..
న్యూఢిల్లీలో శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..
న్యూఢిల్లీలో శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..
ఆ స్పెషల్ పర్సన్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన ఎంఎస్ ధోని
ఆ స్పెషల్ పర్సన్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన ఎంఎస్ ధోని
మనం తినే పన్నీర్ అసలీయా.. నకిలీయా.. ఇంట్లో ఇట్టే గుర్తించవచ్చు..
మనం తినే పన్నీర్ అసలీయా.. నకిలీయా.. ఇంట్లో ఇట్టే గుర్తించవచ్చు..
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్