టమాటలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఇందులోని పొటాషియం రక్తపోటును కంట్రోల్ చేస్తుంది.
ఎండకాలం కచ్చితంగా ఆహారంలో పుచ్చకాయను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఏకంగా 90 శాతం నీటి కంటెంట్ ఉంటుంది. అలాగే శరీరాన్ని చల్లగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.
సమ్మర్‌లో కచ్చితంగా పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పొటాషియం రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
ఇక సమ్మర్‌లో కచ్చితంగా కీరదోసను తీసుకోవాలి. ఇందులోని నీటి కంటెంట్ డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవచ్చు. ఇందులోని అధిక ఫైబర్ సమ్మర్‌లో జీర్ణ సమస్యలు రాకుండా చూస్తాయి.
ఇక పుదీనా కూడా సమ్మర్‌లో ఎంతో మేలు చేస్తుంది. పుదీనాను చట్నీ చేసుకొని తినడం లేదా డ్రింక్ రూపంలో తీసుకున్నా శరీరానికి చలువ చేస్తుంది.
సమ్మర్‌లో ఉసిరిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది ఇది మంచి కూలింగ్ ఎఫెక్ట్ ను కూడా ఇస్తుంది. అలాగో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
వీటన్నింటితో పాటు సమ్మర్‌లో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కచ్చితంగా నీటిని ఎక్కువగా తీసుకోవాలి. రోజులో కనీసం 3 లీటర్ల నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.