
నటుడు కృష్ణ భగవాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, ఇండస్ట్రీలోని పలు సంఘటనలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ మాటల్లో పవన్ కళ్యాణ్, రామ్ గోపాల్ వర్మ(RGV)ల మధ్య జరిగిన ఒక సంఘటన గురించి కూడా ప్రస్తావించారు. కృష్ణ భగవాన్ చెప్పిన దాని ప్రకారం, తాను వెళ్లి పవన్ కళ్యాణ్ ఒక కథ చెప్పానని.. అది ఆయనకు బాగా నచ్చిందని.. దానికి తగ్గట్టుగా ఆయన నాలుగు సినిమాలు చూడమని చెప్పారని అన్నారు. అయితే రామ్ గోపాల్ వర్మకు చెప్పినప్పుడు, దానిని RGV తిరస్కరించారు. ఇది సుస్వాగతం సినిమా సమయం నాటిదని, ఆ సమయంలో పవన్ కళ్యాణ్ మంచి రైజ్‌లో ఉన్నారని, అయినప్పటికీ RGV కథను తిరస్కరించారని కృష్ణ భగవాన్ వివరించారు.
ఈ సంఘటన తర్వాత తాను RGV, పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి కథల గురించి మాట్లాడటం జరగలేదని ఆయన తెలిపారు. వైఫ్ ఆఫ్ వరప్రసాద్ సినిమాలో ఒక పాత్ర కోసం రామ్ గోపాల్ వర్మ అడిగారని, అయితే ఆ పాత్రను ఆయన చేయలేదని, వినీత్ ఆ పాత్రను పోషించారని కృష్ణ భగవాన్ వెల్లడించారు. ఆ సినిమాలో తాను రచయితగా పాల్గొన్నానని, డైలాగులకు కేవలం థాట్ కాంట్రిబ్యూషన్ మాత్రమే ఇచ్చానని స్పష్టం చేశారు. పూర్తిస్థాయి రచయితగా తనను తాను నిలబెట్టుకోవడానికి తాను ఎప్పుడూ ప్రయత్నించలేదని, దర్శకుడిగా కూడా మొగ్గు చూపలేదని ఆయన అన్నారు. ఒక నటుడిగా మాత్రమే తన ప్రయాణాన్ని ఎంజాయ్ చేశానని తెలిపారు. దర్శకులతో కలిసి పనిచేసేటప్పుడు, ఒక సన్నివేశాన్ని ఇలా కాకుండా అలా చిత్రీకరిస్తే బాగుంటుందని సలహాలు ఇస్తుంటానని, దర్శకులు అంగీకరిస్తే సంతోషమని, లేదంటే వారి ఇష్టమని కృష్ణ భగవాన్ పేర్కొన్నారు.
ఇది చదవండి: ఎలాంటి పాము కరిచినా సరే.. ఈ వేరు చప్పరిస్తే విషం వెంటనే విరిగిపోతుంది..