
సంగీతానికి భాషతో పనిలేదు.. భావం ఉంటే చాలు.. అంతేకాదు.. మ్యూజిక్ మనసుకు ప్రశాంతత ఇస్తుంది. అందుకే చాలా మంది సంతోషంలో ఉన్నా.. లేద బాధ కలిగినా ముందుగా పాటలు వింటారు. అయితే ప్రస్తుతం యూట్యూబ్ లో ఎన్నో సాంగ్స్ వైరలవుతున్నాయి. ఓవైపు తెలంగాణ ఫోక్ సాంగ్స్ దూసుకుపోతున్నాయి. అలాగే ఇటు సినిమా పాటలు సైతం మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక పాట విడుదలై దాదాపు 25 ఏళ్లు పూర్తైంది. అయినప్పటికీ ఆ సాంగ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. 2001లో రిలీజ్ అయిన ఆ పాట ఇప్పటికీ ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉంది. హీరోయిన్ కళ్ల అందాన్ని చూసి హీరో మైమరచిపోతాడు. దీంతో ఆ అమ్మాయి అందాన్ని పొగడుతూ పాట పాడుకుంటాడు. నిజానికి ఈ పాట అప్పట్లో ఓ రేంజ్ లో హిట్టైంది. ఇప్పటికీ ఆ సాంగ్ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా త్రిష.. వీడియోస్ ఇదిగో..
ఇంతకీ ఆ పాట ఏంటీ అనుకుంటున్నారా.. ? అదేనండి.. “ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు.. ఇంకెలాగ సత్యభామ.. నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు.. ఏమి చేయనోయి రామ” సాంగ్. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో ఆర్తి అగర్వాల్ కథానాయికగా నటించింది. ఈ సినిమాతోనే ఆర్తి అగర్వాల్ తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రానికి కే. విజయ భాస్కర్ దర్శకత్వం వహించగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతమైన కథ, మాటలు అందించారు.
ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‌లాగే ఉందిగా..
ఇక కోటీ అందించిన మ్యూజిక్ శ్రోతలను కట్టిపడేసింది. ఈ సినిమాలోని ప్రతి పాట ఎవర్ గ్రీన్ హిట్స్ అని చెప్పాలి. ఇక ఇందులోని ఉన్నమాట చెప్పనీవు సాంగ్ విషయానికి వస్తే..దాదాపు 25 సంవత్సరాలుగా ట్రెండ్ అవుతూనే ఉంది. అందుకే ఇప్పుడు మరోసారి మీరు పాడుకోండి.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్‌తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..
ఎక్కువమంది చదివినవి : Cinema: 5 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది..