Tollywood : 50 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగిల్.. ఒంటరిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్లు వీరే..

సినీరంగంలో చాలా మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. కొందరు తారలు ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఇంకా ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. అయితే సినిమాల్లో కథానాయికలుగా కనిపించి అందంతో కుర్రవాళ్ల హృదయాలు దొచేసిన పలువురు తారలు మాత్రం పెళ్లికి దూరంగా సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ వాళ్లెవరో తెలుసుకుందామా.

Tollywood : 50 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగిల్.. ఒంటరిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్లు వీరే..
Nagma, Tabu, Sushmitha Sen

Updated on: Jan 01, 2026 | 8:35 PM

సినిమా ప్రపంచంలో తమ అందం, అభినయంతో కట్టిపడేసిన తరాలు చాలా మంది ఉన్నారు. కొందరు పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. మరికొందరు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే వారిలో పలువురు తారలు పెళ్లి చేసుకుండా సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. 50 ఏళ్లు దాటినప్పటికీ పెళ్లి మాట ఎత్తకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. 90లలో ఇండస్ట్రీని ఏలిన చాలా మంది తారలు.. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టకుండానే సింగిల్ లైఫ్ గడుపుతున్నారు. ఇంతకీ సినిమా ప్రపంచంలో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్న తరాలు ఎవరో తెలుసుకుందామా.

పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్న తొలి నటి సుస్మితా సేన్ . మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఆమె. సుస్మితా సేన్ వయసు 50 సంవత్సరాలు. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. బాలీవుడ్‌లోని అత్యంత అందమైన నటీమణులలో ఒకరైన టబు ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. ఆమెకు ఇప్పుడు 54 సంవత్సరాలు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది.

అలాగే.. కాజోల్ సోదరి, అజయ్ దేవగన్ వదిన తనీషా ముఖర్జీ కూడా సింగిల్ లైఫ్ గడుపుతుంది. బిగ్ బాస్ వంటి అనేక సినిమాలు, రియాలిటీ షోలలో కనిపించిన తనీషా ముఖర్జీ వయసు 48 సంవత్సరాలు. శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి కూడా పెళ్లికి దూరంగా ఉంటుంది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఆమె వయసు 46 సంవత్సరాలు. మహేష్ బాబుతో నాని సినిమాలో కనిపించిన అమీషా పటేల్ సైతం ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. వీరితోపాటు హీరోయిన్ నగ్మా సైతం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది. అలాగే ఒకప్పటి హీరోయిన్ సితార సైతం పెళ్లి చేసుకోలేదు.