
లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది. హరి దర్శకత్వం వహించిన 2005 చిత్రం ‘అయ్యా’తో నయనతార తమిళ చిత్రసీమలో కథానాయికగా అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఒక మలయాళ టెలివిజన్ ఛానల్‌లో ప్రజెంటర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించి, ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతున్నారు. 2026లో విడుదలైన ‘టాక్సిక్’ ఒక భారీ చిత్రం, ఇందులో నయనతార ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి మహిళా దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..
అయితే గతంలో గీతూ మోహన్ దాస్ కథానాయికగా అనేక చిత్రాల్లో నటించారు. తెలుగుతోపాటు మలయాళంలో పలు సినిమాల్లో మెప్పించారు. అయితే నయనతార, గీతూ మోహన్‌దాస్ కలిసి నటించిన చిత్రం ఏంటో మీకు తెలుసా? నయనతార, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ 2005లో విడుదలైన మలయాళ చిత్రం ‘రప్పగల్’లో కలిసి పనిచేశారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కథానాయకుడిగా నటించడం గమనార్హం. అప్పట్లో వీరిద్దరు కలిసి నటించిన సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..
చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న గీతూ మోహన్ దాస్. ఇప్పుడు దర్శకురాలిగా మారారు. భారీ అంచనాల మధ్య విడుదలైన టాక్సిక్ సినిమాకు మిశ్రమ స్పందన వస్తుంది. ఇందులో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషీ కీలకపాత్రలు పోషించారు.
ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..
ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..