Anushka Shetty : అనుష్క రిజెక్ట్ చేసిన సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన కాజల్ అగర్వాల్.. హీరో ఎవరంటే..

అనుష్క శెట్టి.. దక్షిణాది సినీప్రియులకు పరిచయం అక్కర్లేని హీరోయిన్. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత తెలుగు, తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే సెటిల్ అయిన అనుష్క.. హిందీ సినిమా ప్రపంచంలోకి మాత్రం అడుగుపెట్టలేదు. కానీ ఓ స్టార్ హీరోతో అనుష్కకు ఛాన్స్ వచ్చిందట.

Anushka Shetty : అనుష్క రిజెక్ట్ చేసిన సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన కాజల్ అగర్వాల్.. హీరో ఎవరంటే..
Anushka, Kajal

Updated on: Nov 26, 2025 | 12:43 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. నాగార్జున, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోలతో అనేక బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ చేసి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. తెలుగులో రెండో సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. సూపర్ సినిమా తర్వాత ఆమె నటించిన అరుంధతి సినిమా ఏ స్థాయిలో హిట్టైందో చెప్పక్కర్లేదు. ఆ తర్వాత మిర్చి, విక్రమార్కుడు, భాగమతి వంటి సినిమాలతో నటిగా ప్రశంసలు అందుకుంది. ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత ఇండస్ట్రీలో అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. ఎప్పుడో ఒక సినిమా చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఇదెలా ఉంటే.. తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్స్ చేసిన అనుష్క.. ఇప్పటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. నిజానికి గతంలో ఆమెకు ఓ స్టార్ హీరోతో ఛాన్స్ వచ్చినప్పటికీ సున్నితంగా రిజెక్ట్ చేసిందట. బాలీవుడ్ టాప్ ప్రొడ్యుసర్ కరణ్ జోహార్ తన సొంత నిర్మాణంలో అనుష్క ఓ సినిమా చేయాలనుకున్నారట. అజయ్ దేవ్ గన్ ప్రధాన పాత్రలో నటించే ఆ ప్రాజెక్టు కోసం అనుష్కను సంప్రదించగా.. ఆమె రిజెక్ట్ చేసినట్లు టాక్. ఆ సినిమాలో తన పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతోనే అనుష్క ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనే టాక్ వినిపించింది. ఆ సినిమా పేరు సింగం.

తమిళంలో సూర్య, అనుష్క కాంబోలో వచ్చిన సినిమా సింగం. ఈ మూవీని తెలుగులోనూ డబ్ చేయగా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు కరణ్. హీరోయిన్ కోసం అనుష్కను సంప్రదించగా.. ఆమె రిజెక్ట్ చేసిందట. చివరకు ఆమె స్థానంలోకి కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసుకున్నారట. అనుష్క చివరగా ఘాటి చిత్రంలో నటించింది.

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..