Tollywood : 5 ఏళ్లుగా ఒక్క సినిమా లేదు.. అయినా వంట మనిషికి రూ.5 లక్షల జీతం.. ఈ నటి ఎవరంటే..

సినీరంగంలో అత్యధిక డిమాండ్ ఉన్న డైరెక్టర్ ఆమె.. అలాగే పాపులర్ కొరియోగ్రాఫర్ కూడా. గత 5 సంవత్సరాలుగా ఆమె ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ తన వంటమనిషికి మాత్రం రూ.1 లక్ష వరకు జీతం ఇస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందామా.

Tollywood : 5 ఏళ్లుగా ఒక్క సినిమా లేదు.. అయినా వంట మనిషికి రూ.5 లక్షల జీతం.. ఈ నటి ఎవరంటే..
Farah Khan

Updated on: Jan 16, 2026 | 3:40 PM

బాలీవుడ్ పాపులర్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో హిట్ చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం ఆమె సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. కొరియోగ్రఫీ కంటే యూట్యూబ్‌లో ఎక్కువగా యాక్టివ్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఫరా వంట వీడియోలు , వంటమనిషి దిలీప్ వీడియోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు దిలీప్ కి లక్ష రూపాయలు జీతం ఇచ్చే ఫరా ఎన్ని కోట్లకు యజమాని? అని నెట్టింట సెర్చ్ చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‏కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..

ఫరా ఖాన్ 2024 లో తన సొంత యూట్యూబ్ ఛానెల్ ని ప్రారంభించింది. ఆమె తన వంటవాడు దిలీప్ తో కలిసి కుకింగ్ వీడియోస్ షేర్ చేస్తుంది. మొదటి వీడియోకే ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. కొన్ని నెలల్లోనే, ఆమె ఛానెల్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. యూట్యూబ్ నుంచి భారీగా సంపాదన వస్తుందని.. ఓటీటీ, టీవీ వంటి వాటికంటే ఎలాంటి పరిమితులు లేకుండా యూట్యూబ్ లో పనిచేయవచ్చని తెలిపింది.

ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..

ఫరా ఖాన్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 80 నుండి 85 కోట్లు ఉంటుందని సమాచారం. ఇందులో సినిమాలు, కొరియోగ్రఫీ, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, ఇప్పుడు ఆమె యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆమె సంపాదనలో ఎక్కువ భాగం ఉంది. చిత్ర పరిశ్రమ నుండి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు ఫరా ఖాన్ ప్రయాణం ప్రస్తుతం చాలా మందికి స్ఫూర్తినిస్తోంది.

Farah Khan News

ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..