Pooja Hegde: పూజాహెగ్డే ప్రియుడు మామూలోడు కాదు.. అతని గురించి ఈ విషయాలు తెలుసా..

|

Apr 02, 2024 | 1:15 PM

లావణ్య త్రిపాఠి, రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోవడంతో మిగిలిన ముద్దుగుమ్మల పెళ్లిళ్ల గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా త్వరలోనే తన ప్రియుడు విజయ్ వర్మను పెళ్లాడనుంది. కాగా పూజా హెగ్డే పెళ్లి గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Pooja Hegde: పూజాహెగ్డే ప్రియుడు మామూలోడు కాదు.. అతని గురించి ఈ విషయాలు తెలుసా..
Pooja Hegde
Follow us on

ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లి బాజాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది పెళ్లి చేసుకొని కొత్తజీవితం ప్రారంభిస్తే మరికొంతమంది పెళ్ళికి రెడీగా ఉన్నారు. లావణ్య త్రిపాఠి, రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోవడంతో మిగిలిన ముద్దుగుమ్మల పెళ్లిళ్ల గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా త్వరలోనే తన ప్రియుడు విజయ్ వర్మను పెళ్లాడనుంది. కాగా పూజా హెగ్డే పెళ్లి గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా రాణించింది పూజా హెగ్డే.. తెలుగుతో పాటు తమిళ్ లోనూ హిట్స్ అందుకుంది. ఆతర్వాత  తెలుగు, తమిళ స్టార్ హీరోల ఫస్ట్ ఛాయిస్‌గా నిలిచింది.

అంతే కాదు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా కూడా నిలిచింది. కానీ గత రెండేళ్లలో అంతా మారిపోయింది. తెలుగు, తమిళ చిత్రసీమలో పూజా హెగ్డే  చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. పూజా హెగ్డే స్థానాన్ని శ్రీలీల, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ భర్తీ చేస్తున్నారు.  ఇదిలా ఉంటే తాజాగా ముంబై వీధుల్లో పూజా హెగ్డే తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కనిపించింది. నటుడు రోహనా మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల ఈ జంట ముంబైలోని బాంద్రాలో కలిసి కనిపించింది. ఈ జంట గతంలో ముంబైలో చాలాసార్లు కలిసి కనిపించింది. రోహన్ మెహ్రా దివంగత నటుడు వినోద్ మెహ్రా కుమారుడు.

రోహన్ మెహ్రా ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ‘బజార్’ సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. ‘420 ఐపీసీ’ సినిమాలో సపోర్టింగ్ రోల్‌లో కనిపించాడు. ఇప్పుడు ‘అద్భుతం’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇవి కాకుండా, అతను ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’, ‘కాల్’ అనే వెబ్ సిరీస్‌లలో కూడా నటించాడు. కాగా ఈ ఇద్దరూ  కోవిడ్ టైం నుంచి ప్రేమలో ఉన్నారని , తమ ప్రేమను చాలా కాలం పాటు రహస్యంగా ఉంచారని బీ టౌన్ లో టాక్. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని అందుకే ఓపెన్ గా తిరుగుతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే చివరిసారిగా ఏడాది క్రితం విడుదలైన హిందీ చిత్రం ‘కిసేకి భాయ్, కిసేకి జాన్’లో కనిపించింది. ఆ తర్వాత పూజ మరో సినిమాలో నటించలేదు. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఇప్పుడు ఒకే ఒక్క సినిమా ఉంది. పూజా హెగ్డే ‘దేవా’ అనే చిత్రంలో నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.