AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Ansh: బాక్సాఫీస్ షేక్ చేస్తున్న హనుమాన్ అంశ్.. ఈ సినిమా ప్రొడ్యూసర్ 21 ఏళ్ల అమ్మాయి..

ఎలాంటి అంచాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సినిమా గురించి మీకు తెలుసా.. ? ఇప్పుడు అందరూ ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. కేవలం 2 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.122 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ మూవీ నిర్మించిన ప్రొడ్యూసర్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు.

Hanuman Ansh: బాక్సాఫీస్ షేక్ చేస్తున్న హనుమాన్ అంశ్.. ఈ సినిమా ప్రొడ్యూసర్ 21 ఏళ్ల అమ్మాయి..
Anupriya Nagar
Rajitha Chanti
|

Updated on: Sep 07, 2026 | 3:48 PM

Share

హనుమాన్ అంశ్.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సినిమా ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. స్టార్ హీరోహీరోయిన్లు, గ్లామర్ పాటలు లేకపోయినప్పటికీ ఈ సినిమా చూసేందుకు జనాలు బారులు కట్టారు. అయితే సినిమా కథ, కథనం ఒక ఎత్తు అయితే ఇప్పుడు అంతా ఈ మూవీ ప్రొడ్యుసర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే కేవలం 21 ఏళ్ల అమ్మాయి ఈ చిత్రాన్ని నిర్మించింది. అవును. మీరు విన్నది నిజమే.. 21 ఏళ్ల వయసులో అనుప్రియ నగర్ యూకేలోని బాత్ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రం చదవడం నుండి, 2026లో అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచిన ఒక చలన చిత్రాన్ని నిర్మించే స్థాయికి ఎదిగింది. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం నుండి ప్రేరణ పొందిన ఆమె తొలి నిర్మాణ చిత్రం ‘హనుమాన్ అంశ్’. ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై, మొదటి రోజున కేవలం రూ. 10 లక్షల వసూళ్లను సాధించింది. దాదాపు నాలుగు వారాల తర్వాత, సెప్టెంబర్ 2 నాటి నివేదికల ప్రకారం.. ఈ చిత్రం భారతదేశంలో రూ. 72.32 కోట్ల స్థూల వసూళ్లను నమోదు చేసింది. 27వ రోజు తర్వాత దీని నికర వసూళ్లు రూ. 61.38 కోట్లుగా ఉన్నాయి.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

అనుప్రియ విషయానికి వస్తే.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన అనుప్రియ.. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక స్విట్జర్లాండ్ లో ఆర్ట్ ఇండస్ట్రీలో ఒక మంచి ఉద్యోగం చేయాలని అనుకుంది. అయితే ఆమె చదువు ఆఖరి సంవత్సరంలో టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించిన గొప్ప మహానుభావుల జీవితాలపై పరిశోధన చేయడం స్టార్ట్ చేసింది. చదువు మధ్యలోనే స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్రను లోతుగా అధ్యయనం చేసింది. స్టీవ్ జాబ్స్ కు భారత్ లోని నీమ్ కరోలీ బాబాతో ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం, ఆయన ఉత్తరాఖండ్ లోని కైంచి ధామ్ సందర్శించిన విషయాల గురించి తెలుసుకుంది. అయితే ఒక విదేశీ వ్యాపార దిగ్గజం ద్వారా మన భారతీయ ఆధ్యాత్మిక వేత్త గురించి తెలుసుకోవడం ఏంటీ అనే ఆలోచనలో పడిపోయింది. చదువు పూర్తయ్యాక తిరిగి భారత్ వచ్చిన ఆమె అనుకోకుండా డైరెక్టర్ విశాల్ చతుర్వేదితో పరిచయం ఏర్పడింది. ఆయన అప్పటికే నీమ్ కరోలీ బాబా బాల్యం ఆధారంగా ఒక బయోపిక్ తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

యూకేలో విద్యార్థిగా ఉన్నప్పుడు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసి తను సొంతంగా దాచుకున్న కష్టార్జితాన్ని ఈ సినిమాకు పెట్టింది. కేవలం రెండు కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఎలాంటి హడావిడి లేకుండానే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 31 రోజుల్లోనే రూ.122 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

Follow Us
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన విద్యుత్ ఏఈ..!
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన విద్యుత్ ఏఈ..!
చికెన్ లవర్స్ జాగ్రత్త.. రోజూ తింటే ఈ రోగాలకు వెల్కమ్ చెప్పినట్టే
చికెన్ లవర్స్ జాగ్రత్త.. రోజూ తింటే ఈ రోగాలకు వెల్కమ్ చెప్పినట్టే
నెగెటివ్‌ థాట్స్ ఎలా ఆపాలి? ఈ కథ మీ సందేహాలకు సమాధానం చెబుతుంది!
నెగెటివ్‌ థాట్స్ ఎలా ఆపాలి? ఈ కథ మీ సందేహాలకు సమాధానం చెబుతుంది!
డబ్బు నిలవడం లేదా..? ఆర్థిక ఇబ్బందులకు కేమద్రుమ యోగమే కారణమా?
డబ్బు నిలవడం లేదా..? ఆర్థిక ఇబ్బందులకు కేమద్రుమ యోగమే కారణమా?
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలా..? రూల్స్‌లో పెద్ద మార్పులు..
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలా..? రూల్స్‌లో పెద్ద మార్పులు..
35 ఏళ్లకే కన్నుమూసిన నవ్వుల నవాబు..
35 ఏళ్లకే కన్నుమూసిన నవ్వుల నవాబు..
జాతీయ పక్షి నెమలి ఎన్ని సంవత్సరాలు జీవిస్తుందో తెలుసా?
జాతీయ పక్షి నెమలి ఎన్ని సంవత్సరాలు జీవిస్తుందో తెలుసా?
కాఫీ ఎక్కువగా తాగే దేశమేది? యాపిల్, నిమ్మ ఎందుకు నీళ్లలో తేలుతాయి
కాఫీ ఎక్కువగా తాగే దేశమేది? యాపిల్, నిమ్మ ఎందుకు నీళ్లలో తేలుతాయి
తొందరగా బరువు పెరిగే నెల్లూరు గొర్రెలు: లాభదాయక పెంపకం
తొందరగా బరువు పెరిగే నెల్లూరు గొర్రెలు: లాభదాయక పెంపకం
నవరాత్రుల్లో ఈ రాశులకు రాజయోగం.. సంపద, ఉద్యోగం, వ్యాపారంలో..
నవరాత్రుల్లో ఈ రాశులకు రాజయోగం.. సంపద, ఉద్యోగం, వ్యాపారంలో..