Prashanth Neel : వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోలను లైన్ లో పెడుతున్న కేజీఎఫ్ డైరెక్టర్.. ఇప్పుడు ఆ హీరోతో కూడా..

'కేజీఎఫ్‌' వంటి భారీ చిత్రంతో ఒక్కసారిగా నేష‌న‌ల్ లెవ‌ల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. భారీ ఎలివేష‌న్ సీన్ల‌తో సౌత్ ఇండియా స్టార్ హీరోలా అటెన్ష‌న్ డ్రా చేశాడు. ఇప్పుడాయన 'కేజీఎఫ్' సీక్వెల్ తీసే ప‌నిలో బిజీగా ఉన్నారు.

Prashanth Neel : వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోలను లైన్ లో పెడుతున్న కేజీఎఫ్ డైరెక్టర్.. ఇప్పుడు ఆ హీరోతో కూడా..

Updated on: Mar 10, 2021 | 3:02 AM

Prashanth Neel : ‘కేజీఎఫ్‌’ వంటి భారీ చిత్రంతో ఒక్కసారిగా నేష‌న‌ల్ లెవ‌ల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. భారీ ఎలివేష‌న్ సీన్ల‌తో సౌత్ ఇండియా స్టార్ హీరోలా అటెన్ష‌న్ డ్రా చేశాడు. ఇప్పుడాయన ‘కేజీఎఫ్’ సీక్వెల్ తీసే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆ సినిమా ప‌నులు చివ‌రిద‌శ‌కు వ‌చ్చేశాయి. ఈ నేపథ్యంలో త‌న నెక్ట్స్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు ప్రశాంత్‌. రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సలార్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. ప్రభాస్ సలార్ ఏప్రిల్ 14, 2022న విడుదల కానుంది.

ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ కోసం ఇప్పుడు స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు.  కాగా టాలీవుడ్ టాప్ చిత్రాల నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో ఓ మూవీ చేసేందుకు ప్రశాంత్‌ నీల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు ఎప్పటినుంచో చిత్రసీమలో వార్త‌లు వినిపిస్తున్నాయి. వీళ్ల కాంబోలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ఓ పాన్‌ ఇండియా మూవీ తెర‌కెక్కించ‌డానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే మైత్రీ సంస్థ ప్రశాంత్‌కు రూ.2కోట్లు అడ్వాన్సు ఇచ్చిన‌ట్టు ఇండ‌స్ట్రీ టాక్.  ఇదిలా ఉంటే తాజాగా మరో స్టార్ హీరోతో ప్రశాంత్ సినిమా చేయబోతున్నాడంటూ ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఎవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా ఈ కథ ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anil Ravipudi : `గాలి సంప‌త్` కథ ఆడియన్స్‌ని తప్పకుండా థ్రిల్ చేస్తుంది – అనిల్ రావిపూడి.

Alanti Sitralu Teaser : వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థతో తెరకెక్కిన ‘అలాంటి సిత్రాలు’.. ఆసక్తికరంగా టీజర్