
టాలీవుడ్ ప్రేక్షకులకు ‘కేరింత’ సినిమాతో పరిచయమైన నటి సుకృతి అంబటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రంలో ‘భావన’ పాత్రలో తన నటనతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ, ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యతనిచ్చారు. తాజాగా ఈ నటి తన అభిమానులకు ఓ ఆనందకరమైన వార్తను పంచుకున్నారు. తాను పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులు, తోటి నటీనటులు ఈ జంటకు అభినందనల వెల్లువ కురిపిస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి : Hemachandra : శ్రావణ భార్గవితో విడాకులు ?.. రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర.. ఏమన్నారంటే..
ఢిల్లీకి చెందిన సుకృతి, చదువుకునే రోజుల్లోనే నటన, డ్యాన్స్‌పై ఆసక్తి పెంచుకున్నారు. అలా ‘కేరింత’ ద్వారా తెరంగేట్రం చేశారు. ఇక ఆమె వైవాహిక జీవితం విషయానికి వస్తే, 2022 డిసెంబర్‌లో అక్షయ్ సింగ్‌తో సుకృతి వివాహం జరిగింది. గత కొన్నేళ్లుగా వైవాహిక బంధాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్న ఈ జంట, ఈ ఏడాది ఏప్రిల్‌లో తాము తల్లిదండ్రులు కాబోతున్నామనే శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. సోషల్ మీడియాలో బేబీ బంప్‌తో ఆమె ఫోటోలను షేర్ చేయగా, అప్పట్లో అవి బాగా ట్రెండ్ అయ్యాయి.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ..
సినిమా కెరీర్‌కు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉంటున్న సుకృతి, ఇప్పుడు మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్నారు. అమ్మగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టిన సుకృతికి నెటిజన్లు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తన చిన్నారి రాకతో తమ జీవితంలో ఎంతో వెలుగు నిండిందని ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి : Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
ఎక్కువమంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్‌తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే.. ఆ నిర్ణయమే పొరపాటు అయ్యింది..