సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ తారల తళుకులతో పాటు మనకు తెలియని ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పటినుంచో ఉంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, సినిమా తారలు కూడా సినీ ఇండస్ట్రీలో వేధింపులు ఎదుర్కొన్నారు. అయితే తమ చేదు అనుభవాలను పంచుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎప్పుడైతే మీటూ ఉద్యమం తెరపైకి వచ్చిందో చాలామంది తారలు క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. అవకాశాల కోసం తామెంతటి అవమానాలు, వేధింపులు ఎదుర్కొన్నామో ధైర్యంగా బయటపెట్టారు. తాజాగా ఈ వ్యవహారంపై మహానటి కీర్తి సురేశ్ కూడా స్పందించింది. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమా ఛాన్సుల కోసం కమిట్మెంట్ ఇచ్చే రకం కాదంటూ కీర్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
‘సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. నాతో పాటు నటించిన కొందరు హీరోయిన్లు, సినిమా తారలు కూడా దీని గురించి నాకు చెప్పారు. అయితే ఇప్పటివరకు నాకెలాంటి వేధింపులు ఎదురుకాలేదు. క్యాస్టింగ్ కౌచ్ అనేది మన ప్రవర్తన బట్టి కూడా ఉంటుందేమో. అందుకే ఇలాంటి సంఘటన నాకు ఇప్పటి వరకు ఎదురుకాలేదు. ఒకవేళ నిజంగా నన్ను ఎవరైనా కమిట్మెంట్ అడిగితే అసలు దానికి అంగీకరించను. కావాలంటే సినిమాలు మానేసి ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను. అంతేకానీ సినిమా ఛాన్సుల కోసం కమిట్మెంట్ ఇచ్చే టైప్ కాదు’ అని కీర్తి పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
కాగా మహేష్ సర్కారు వారి పాట సినిమాతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంది కీర్తి. ప్రస్తుతం నాని సరసన దసరా చిత్రంలో నటిస్తోంది. అలాగే భోళాశంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా నటిస్తోంది. వీటితో పాటు మామన్నన్, సైరన్ సినిమాల్లోనూ నటిస్తూ బిజిబిజీగా ఉంటోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..