భారత క్రికెటర్లు, బాలీవుడ్ హీరోయిన్లను ఇష్టపడటం, డేటింగ్ చేయడం కొత్తేమీ కాదు. ఇక పాకిస్థాన్ క్రికెటర్లు కూడా బాలీవుడ్ ముద్దుగుమ్మలపై మనసు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయి. గతంలో రావల్పిండి ఎక్స్ ప్రెస్ అక్తర్ సోనాలి బింద్రేపై తన ఇష్టాన్నిప్రదర్శించేవాడు. తాజాగా పాక్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా ఓ బాలీవుడ్ హీరోయిన్ అంటే ఇష్టమని చెప్పేశాడు. జులై 28 నుంచి ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు ఆదివారం పాకిస్థాన్ టీమ్ ఇంగ్లాండ్‌కు వెళ్లింది. ఈ టూర్‌కి వెళ్లేముందు సర్ఫరాజ్ అహ్మద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
ఇంటర్వ్యూ చేసే వ్యక్తి.. దీపికా పదుకొణె, కత్రీనా కైఫ్ ఇద్దరిలో మీకు ఎవరిష్టం అని అడగ్గా.. ‘నాకు కత్రీనా కైఫ్ అంటే చాలా ఇష్టం’ అని టక్కున ఆన్సరిచ్చాడు సర్ఫారాజ్. ఈ పాకిస్థానీ ప్లేయర్ ఫిట్‌నెస్ సమస్య కారణంగా సారథ్య బాధ్యతలతో పాటు జట్టులో ప్లేస్ కూడా కోల్పోయాడు. మళ్లీ ఫోకస్ పెట్టి తాజాగా ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికయ్యాడు.