Adipurush: మరోసారి చిక్కుల్లో ఆదిపురుష్‌.. అక్కడ సినిమాను బ్యాన్ చేయలేని ఆదేశం

ఈ మూవీ హిందూ సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని కించపరిచేలా ఉందంటూ ఇప్పటికే పలు హిందూ సంఘాలతో పాటు సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లేటెస్ట్‌గా ఖాట్మండ్‌లో వివాదం మొదలైంది.

Adipurush: మరోసారి చిక్కుల్లో ఆదిపురుష్‌.. అక్కడ సినిమాను బ్యాన్ చేయలేని ఆదేశం
Adipurush Ott

Updated on: Jun 19, 2023 | 2:03 PM

ఆదిపురుష్‌ చిత్రం చుట్టూ వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఈ మూవీ హిందూ సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని కించపరిచేలా ఉందంటూ ఇప్పటికే పలు హిందూ సంఘాలతో పాటు సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లేటెస్ట్‌గా ఖాట్మండ్‌లో వివాదం మొదలైంది. సీతాదేవి జన్మస్థలాన్ని తప్పుగా చూపించారంటూ ఖాట్మండ్ మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ఏరియాల్లో సినిమాను బ్యాన్ చేయాలని ఆదేశించారు. సీతాదేవిని భారత సంతతి మహిళగా చూపించడంపై ప్రదానంగా ఖాట్మండ్ మేయర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు . మరోవైపు ఖాట్మండ్ మేయర్‌కు నేపాల్‌ సెన్సార్ బోర్డ్ లేఖ రాసింది. మూవీలో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవని.. ఓ సారి సినిమాను చూడాలని కోరింది. ఆదిపురుష్‌ సినిమాలో సీతాదేవిని భారత సంతతికి చెందిన మహిళగా చూపించలేదని లేఖలో వివరించింది నేపాల్‌ సెన్సార్ బోర్డ్‌.

ఆదిపురుష్‌ మూవీకి ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. అదే సమయంలో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. హద్దుమీరిన క్రియేటివిటితో రామాయణ గాథను వక్రీకరించారని, సినిమాలో ఆధ్యాత్మిక అంశాలు పూర్తిగా కొరవడ్డాయన్న ఆరోపణలు మిన్నంటాయి. గ్రాఫిక్స్‌తో కనికట్టు చేసే ప్రయత్నం జరిగిందని మెజారిటీ ప్రేక్షకులు మండిపడ్డారు. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ నుంచి స్క్రిప్ట్‌, స్క్రీన్‌ప్లే, సంభాషణలు..ఇలా ప్రతీ అంశంలో సినిమా లోపభూయిష్టంగా ఉందని సోషల్‌మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

లంకా దహనం సన్నివేశంలో జలేగీ భీ తేరే బాప్‌కీ అనే డైలాగ్‌ను హనుమాన్‌ నోట పలికించడం ఆయన పాత్ర ఔన్నత్యాన్ని దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సినిమా విడుదలైన తర్వాత విమర్శల వెల్లువ అంతకుమించి అనేలా కొనసాగుతూనే ఉంది.