నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అమిగోస్.. డిఫరెంట్ చిత్రాలు, విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నందమూరి కళ్యాణ్ రామ్. ఇటీవలే బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు కళ్యాణ్ రామ్. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన బింబిసార సినిమాలో డ్యూయల్ రోల్ లో ఆకట్టుకున్న కళ్యాణ్ రామ్. కాగా ఇప్పుడు అమిగోస్ సినిమాలో త్రిపాత్రాభినంలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న గ్రాండ్ లెవల్లో సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షో నుంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా. ఇదిలా ఉంటే రెండు రోజులకు అమిగోస్ సినిమా ఎంత వసూల్ చేసిందంటే..
నైజాం 1.08 కోట్లు, సీడెడ్ 0.43 కోట్లు, ఉత్తరాంధ్ర 0.36 కోట్లు, ఈస్ట్ 0.29 cr, వెస్ట్ 0.17 కోట్లు, గుంటూరు 0.41కోట్లు, కృష్ణా 0.23 కోట్లు, నెల్లూరు 0.14 కోట్లు, ఏపీ + తెలంగాణ (టోటల్) 3.11 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.25 కోట్లు, ఓవర్సీస్ 0.50 కోట్లు, వరల్డ్ వైడ్ (టోటల్) 3.86 కోట్లు(షేర్) .. సొంతం చేసుకుంది.
అమిగోస్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.