రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ , ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు ప్రభాస్. బాహుబలి సినిమా డార్లింగ్ ను పాన్ ఇండియా స్టార్ చేసింది. ఇక ఇప్పుడు వరుసగా ప్రభాస్ బడా హీరోల సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రభాస్ , కమల్ హాసన్ , దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ లతో పాటు ఇండియన్మ స్టార్ నటులు నటించిన సినిమా ‘కల్కి 2898 AD’. ఈ సినిమా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. సినిమా బుకింగ్‌లు ఇటీవలే ప్రారంభమయ్యాయి. మొదటి రోజు టిక్కెట్‌లు ఇప్పటికే చాలా చోట్ల అమ్ముడయ్యాయి. ఈ సినిమా అనేక భాషల్లోకి డబ్ అయ్యి పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. తాజాగా కల్కి సినిమా విడుదలకు ముందే నయా రికార్డులను క్రియేట్ చేస్తుంది. అలాగే మునుపటి రికార్డులను బద్దలు కొడుతుంది.
తెలుగు వెర్షన్ దాదాపు 2500 స్క్రీన్లలో విడుదల కాబోతోంది. హిందీ వెర్షన్ ‘కల్కి 2898 ఏడీ’ దాదాపు 3500 స్క్రీన్లలో విడుదలవుతోంది. అమెరికా, యూఏఈ సహా మరికొన్ని దేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. తెలుగు సినిమా ఇంత పెద్ద రిలీజ్ అయినరికార్డ్ ఎక్కడా లేదు. ‘ఆర్ఆర్ఆర్’ కంటే ‘కల్కి’ ఎక్కువ థియేటర్లలో విడుదలవుతోంది.
‘కల్కి 2898 ఏడీ’ సినిమా తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్లపై ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. ‘కల్కి’ సినిమా అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 20 కోట్ల రూపాయలకు పైగా రాబట్టింది. ప్రీమియర్ షో ద్వారా ‘కల్కి’ టీమ్‌కి భారీ వసూళ్లు వచ్చాయి. సినిమా విడుదలకు ఇంకా కొన్ని గంటలు మిగిలి ఉండగానే భారతదేశ వ్యాప్తంగా 4 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయి దాదాపు రూ.15 కోట్లు రాబట్టింది. ‘కల్కి 2898 AD’ సినిమా మొదటి రోజు ఇండియాలో 50 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని బాక్సాఫీస్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దేనికంటే రెట్టింపు అవుతుంది అంటున్నారు. ఈ సినిమా తొలిరోజు దాదాపు 90 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబడుతుందని నిపుణుల అంచనా.. ‘కల్కి 2898 AD’ సినిమా రన్ టైం 3 గంటల 59 సెక్షన్స్. రన్ టైం లోనూ ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే అశ్విన్ దత్ నిర్మిస్తున్నారు. జూన్ 27న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..