Tollywood Actresses: సీనియర్ మోస్ట్ హీరోలకు ఫస్ట్‌ ఛాయిస్‌గా మారుతున్న అందాల భామలు..

హీరోలు ఎంత సీనియర్ అయినా కమర్షియల్ స్టార్ అన్న ట్యాగ్‌తోనే కంటిన్యూ అవుతారు. కానీ హీరోయిన్లకు సీనియర్ అన్న ట్యాగ్ యాడ్ అయితే..

Tollywood Actresses: సీనియర్ మోస్ట్ హీరోలకు ఫస్ట్‌ ఛాయిస్‌గా మారుతున్న అందాల భామలు..
Amantha Kajal Tamannaah

Updated on: Apr 16, 2022 | 6:31 PM

హీరోలు ఎంత సీనియర్ అయినా కమర్షియల్ స్టార్ అన్న ట్యాగ్‌తోనే కంటిన్యూ అవుతారు. కానీ హీరోయిన్లకు సీనియర్ అన్న ట్యాగ్ యాడ్ అయితే.. కెరీర్‌ క్లైమాక్స్ వచ్చేసినట్టే. ఆ ట్యాగ్‌ తెచ్చుకున్న వారికి యంగ్ హీరోలతోనే కాదు.. సీనియర్ హీరోలతో కూడా సినిమా ఛాన్స్‌లు రావటం కష్టమైపోతుంది. కానీ ఇలాంటి సిచ్యుయేషన్‌ పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నారు ఈ జనరేషన్ సీనియర్ హీరోయిన్స్. జనరేషన్‌తో సంబంధం లేకుండా స్టార్ ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తున్నారు. కాజల్‌(Kajal), తమన్నా( Tamanna), సమంత(Samantha), శృతి హాసన్‌(Shruti Haasan).. ప్రజెంట్ ఫామ్‌లో ఉన్న సీనియర్ కేటగిరి హీరోయిన్స్‌. గతంలో అయితే సీనియర్ సెగ్మెంట్‌లోకి ఎంటర్‌ అయిన హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోయేవి. కానీ ఈ ఫార్ములాను బ్రేక్ చేసి చూపిస్తున్నారు ఈ బ్యూటీస్‌. యంగ్ జనరేషన్‌తో నటించే అవకాశాలు రాకపోయినా.. తమకంటే వెండితెర మీద సపరేట్‌ స్పేస్‌ క్రియేట్ చేసుకుంటున్నారు. సీనియర్ హీరోయిన్ అన్న ట్యాగ్ యాడ్‌ అయినా.. ఇప్పటికీ కమర్షియల్ ఫార్ములాతో రూపొందుతున్న ఈ సినిమాల్లోనే నటిస్తున్నారు కాజల్‌ అగర్వాల్‌, శృతి హాసన్‌. ఏజ్‌ ఓల్డ్ హీరోలతో జోడికి సై అంటూ సిల్వర్ స్క్రీన్ మీద తమ ప్రెజెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి సీనియర్ మోస్ట్ హీరోలకు ఫస్ట్‌ ఛాయిస్‌గా కనిపిస్తున్నారు ఈ బ్యూటీస్‌.

గ్లామరస్ బ్యూటీస్‌ తమన్నా, రకుల్‌ ప్రీత్ సింగ్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. అప్పుడప్పుడూ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే కమర్షియల్ ఫార్ములా సినిమాల్లోనూ మెరుస్తున్నారు. రకుల్ బాలీవుడ్‌ సినిమాల్లో బిజీగా ఉంటే… తమన్నా డిజిటల్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువగా కాన్సన్‌ట్రేట్‌ చేస్తున్నారు. ఇక సీనియర్ సెగ్మెంట్‌లో ఉన్న సమంత, అనుష్కది మరో ఫార్ములా. రొటీన్ సినిమాలను పక్కన పెట్టి లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు ఈ బ్యూటీస్‌. హీరో ఇమేజ్‌తో సంబంధంలేని సబ్జెక్ట్స్‌ను పిక్ చేసుకుంటూ తమకంటూ సొంత మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇలా సీనియర్ హీరోయిన్లంతా కెరీర్‌ కంటిన్యూ చేసే విషయంలో డిఫరెంట్ స్ట్రాటజీస్‌ ప్లే చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Happy Birthday JD Chakravarthy: పలు భాషల్లో విలక్షణ నటుడి హవా.. వరుస సినిమాలతో జేడీ చక్రవర్తి ఫుల్ బిజీ..

Avantika Mishra: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ‘వైశాఖం’ బ్యూటీ.. వైరల్ అవుతున్న ఫోటోలు

Jayamma Panchayathi: జయమ్మ పంచాయతీ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన సుమక్క..