kajal aggarwal : విడుదలకు సిద్దమవుతున్న కాజల్ సినిమా.. ఇన్నేళ్ల తర్వాత ఓటీటీలోకి..

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో కాజల్ ఒకరు. కళ్యాణ్ రామ్ నటించిన లక్ష్మీకళ్యాణం సినిమాతో ఎంట్రీఇచ్చిన కాజల్ ఆతర్వాత..

kajal aggarwal : విడుదలకు సిద్దమవుతున్న కాజల్ సినిమా.. ఇన్నేళ్ల తర్వాత ఓటీటీలోకి..

Updated on: Jun 28, 2021 | 7:34 AM

kajal aggarwal : టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో కాజల్ ఒకరు. కళ్యాణ్ రామ్ నటించిన లక్ష్మీకళ్యాణం సినిమాతో ఎంట్రీఇచ్చిన కాజల్ ఆతర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాతో కాజల్ ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఆతర్వాత టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఇటీవలే పెళ్లిపీటలెక్కిన ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. అయితే బాలీవుడ్ లో మంచి విజయాన్ని దక్కించుకున్న క్వీన్ సినిమాకు రీమేక్ గా పారిస్ పారిస్ అనే తమిళ్  సినిమాలో నటిచింది కాజల్. ఈ సినిమాను సౌత్ లోని నాలుగు భాషల్లో కూడా ఒకేసారి రీమేక్ ను వేరు వేరు హీరోయిన్స్ తో మొదలు పెట్టారు. తెలుగులో తమన్నా నటిస్తుంది. అయితే రకరకాల కారణాల వల్ల నాలుగు సినిమాలు రిలీజ్ కాలేదు. సినిమాలో కొన్ని బూతు సన్నివేశాలు ఉండటంతో పాటు.. అసభ్యకరంగా డైలాగ్స్ ఉన్నాయట దాంతో సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీల వైపు అంతా చూస్తున్నారు. సెన్సార్ సమస్య ఉన్న ఈ సినిమా ను డైరెక్ట్ ఓటీటీ ద్వారా విడుదల చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారంట మేకర్స్ .అతి త్వరలోనే ఓటీటీతో చర్చలు ముగించి విడుదల తేదీని ప్రకటించేందుకు గాను తమిళ క్వీన్ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Rashmika Fan: పెద్ద సాహ‌సం చేసిన ర‌ష్మిక అభిమాని.. గూగుల్‌లో వెతికి 900 కిలోమీట‌ర్ల ప్ర‌యాణం..కానీ చివ‌రికి..

Sharwanand: కీల‌క నిర్ణ‌యం తీసుకున్న శ‌ర్వానంద్‌.. మ‌హా స‌ముద్రం కోసం పారితోష‌కం త‌గ్గించుకున్న యంగ్ హీరో.

Saaho director Sujeeth: మెగాస్టార్‌ను మిస్ చేసుకున్న సుజిత్.. ధ‌నుష్‌తో దుమ్ము రేపుతాడా..?

Loading...
Unable to load recommendations.
Follow Us