Kajal Aggarwal: ‘చందమామ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది అందాల తార కాజల్ అగర్వాల్. ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ ఇటీవలే ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకున్నా సినిమాలకు మాత్రం దూరం కాలేదీ బ్యూటీ. వరుస సినిమాలకు సైన్ చేస్తూ దూసుకెళుతోంది. ఈ క్రమంలోనే మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న ‘మోసగాళ్లు’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మార్చి 19న దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
‘మోసగాళ్లు’ సినిమా నిర్మాణ విలువలు బాగుంటాయని కాజల్ చెప్పుకొచ్చింది. ఇక సినిమా స్టోరీ గురించి చెబుతూ.. అను, అర్జున్ అనే అక్కాతమ్ముళ్లు మురికివాడ నుంచి వచ్చి అమెరికాలో అతిపెద్ద స్కామ్ ఎలా చేశారన్నది ఈ సినిమా ప్రధానాంశంగా చెప్పుకొచ్చింది. ఇక తన వివాహ జీవితం గురించి చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ.. గౌతమ్ తనకు పదేళ్లుగా తెలుసని, వారిద్దరి మధ్య ఉన్న స్నేహమే ప్రేమగా మారిందని చెప్పుకొచ్చింది. ఇక భర్త గౌతమ్‌కు రామ్ చరణ్ అంటే ఇష్టమని.. హీరోయిన్స్‌లో మాత్రం నేనంటేనే ఇష్టం.. ఆప్షన్ లేదంటూ నవ్వుతూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇక కాజల్ అగర్వాల్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసందే. ఈ సినిమాతో పాటు నాగార్జునతో ఓ సినిమా, తమిళంలో మరో సినిమాలో నటించనుంది.
Also Read: Anupama Instapost: అనుపమ చేసిన ఆ పోస్టులు బుమ్రాను ఉద్దేశించేనా.? అను గుండె ముక్కలైపోయిందా..?